Breaking News

ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. 90 ఏళ్ల తర్వాత!?

Published on Sun, 02/18/2024 - 21:20

రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు ఘోర పరాభావం ఎదురైంది. భారత్‌ చేతిలో ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఓటమి పాలైంది. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. భారత బౌలర్ల దాటికి 122 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా దారుణంగా విఫలమైం‍ది. కనీసం పోటీ ఇవ్వకుండానే ఇంగ్లీష్‌ జట్టు  చేతులేత్తేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో లోయార్డర్‌ ఆటగాడు మార్క్‌ వుడ్‌(33) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసిన ఇంగ్లండ్‌ అత్యంత చెత్త రికార్డును నెల​కొల్పింది. 

టెస్టులలో ఇంగ్లండ్‌ జట్టుకు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ఆ జట్టు 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 రన్స్‌ తేడాతో ఓడింది. అయితే 21వ శతాబ్దంలో మాత్రం ఇంగ్లండ్‌ ఇదే  అతి పెద్ద ఓటమి. 

మరోవైపు భారత్‌ మాత్రం టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ కంటే ముందు 2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. ఇక ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: అతడొక సంచలనం.. ఎంత చెప్పుకున్నా తక్కువే: రోహిత్‌ శర్మ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)