Breaking News

పృథ్వీ షా మెరుపులు; గర్ల్‌ఫ్రెండ్‌ రియాక్షన్‌ చూడాల్సిందే

Published on Tue, 07/20/2021 - 14:08

కొలంబో: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా కొంతకాలంగా ప్రాచీ సింగ్‌ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పృథ్వీ షా శ్రీలంకతో సిరీస్‌ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో పృథ్వీ షా ఉన్న కాసేపు తన ఇన్నింగ్స్ల్‌తో దడదడలాడించాడు. ఐపీఎల్‌ ఫామ్‌ను కంటిన్యూ చేసిన పృథ్వీ షా తన ఇన్నింగ్స్‌ ఆసాంతం బౌండరీలతో రెచ్చిపోయాడు. 24 బంతుల్లోనే 9 ఫోర్లతో మెరుపు వేగంతో 43 పరుగులు చేసిన అతను తృటిలో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను మిస్‌ చేసుకున్నాడు. ఒకరకంగా పృథ్వీ తన మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయాన్ని సులువు చేశాడు.

ఇదిలా ఉంటే పృథ్వీ షా ఇన్నింగ్స్‌పై ప్రాచీ సింగ్‌ ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలను షేర్‌​ చేస్తూ..  మొదటి ఫోటోకు ది బెస్ట్‌ ఇన్నింగ్స్‌.. రెండో ఫోటోకు ఈ ఇన్నింగ్స్‌కు నువ్వు అన్ని రకాలుగా అర్హుడివి అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ప్రాచీ పెట్టిన పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.


ఇక తొలి మ్యాచ్‌లో విజయం అందుకున్న భారత్‌ నేడు రెండో వన్డేకు సిద్ధమవుతుంది. పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ ఘనవిజయం సాధించింది. ఒకరోజు విరామం తర్వాత శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలోని భారత్‌ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని ధావన్‌ సేన పట్టుదలగా ఉంది. 

Videos

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

అదే జరిగితే టీడీపీ క్లోజ్..!

పవన్ సీజ్ ద షిప్ పై జగన్ మాస్ ర్యాగింగ్..

రసవత్తరంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు

నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)