Breaking News

Shubman Gill: ‘గొప్ప గౌరవం... పెద్ద బాధ్యత’

Published on Mon, 05/26/2025 - 01:30

ముంబై: భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో విదేశీ గడ్డపై అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మినహా మన జట్టు రికార్డు పేలవంగానే ఉంది. సహజంగానే సిరీస్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు కెప్టెన్సీపై కూడా అందరి దృష్టీ ఉంటుంది. ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్‌ హోదాలో శుబ్‌మన్‌ గిల్‌ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలిసారి బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో సారథిగా తనపై అనవసరపు ఒత్తిడిని పెంచుకోనని గిల్‌ స్పష్టం చేశాడు. కెపె్టన్‌గా ఎంపికైన తర్వాత అతను బీసీసీఐ మీడియాతో తన స్పందనను పంచుకున్నాడు. 

బ్యాటర్‌గా కూడా తన బాధ్యత నెరవేర్చడం ముఖ్యమని అతను అన్నాడు. ‘ఒక విషయంలో నేను చాలా స్పష్టంగా ఉండదల్చుకున్నాను. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు నేను బ్యాటర్‌గానే ఆలోచిస్తాను. అదే కోణంలో నిర్ణయాలు తీసుకుంటాను తప్ప కెప్టెన్‌ హోదా గురించి పట్టించుకోను. బ్యాటింగ్‌ చేస్తూ కూడా ఇతర అంశాలపై దృష్టి పెడితే సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. అది అవసరం లేదు. నేను కెప్టెన్‌ను అనే భావనే రాకుండా నా బ్యాటింగ్‌తో ఏం చేయగలననేది ముఖ్యం’ అని గిల్‌ వ్యాఖ్యానించాడు. 

భారత కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్న గిల్‌... అదో పెద్ద బాధ్యత అని అభిప్రాయపడ్డాడు. ‘చిన్నప్పుడు క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టినప్పుడు భారత్‌కు ఆడితే చాలనుకుంటాం. ఆ తర్వాత ఎక్కువ కాలం టెస్టులు ఆడితే బాగుంటుందని భావిస్తాం. అలాంటిది ఇప్పుడు కెప్టెన్‌ కావడం గొప్ప గౌరవం. ఇంత పెద్ద బాధ్యత నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని గిల్‌ భావోద్వేగం ప్రదర్శించాడు.

ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంతో పాటు ఏ సమయంలో కెప్టెన్‌ అవసరం జట్టుకు ఉంటుందని గుర్తించడం కూడా కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే టెస్టుల నుంచి రిటైర్‌ అయిన కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని... విదేశాల్లో ఎలా గెలవాలో వారు చూపించారని కొత్త కెప్టెన్‌ అన్నాడు. ‘రోహిత్, విరాట్, అశ్విన్‌ విదేశాల్లో టెస్టులు, సిరీస్‌లు ఎలా గెలవాలనే విషయంలో ఒక ‘బ్రూప్రింట్‌’ను అందించారు. దీనిని అమలు చేయగలగాలి. 

విరాట్, రోహిత్‌ల నాయకత్వంలో ఆడటం నా అదృష్టం. బయటకు కనిపించడంలో ఇద్దరి శైలి భిన్నమే అయినా...మైదానంలో అటాకింగ్‌ చేసే విషయంలో ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. ఎప్పటికిప్పుడు మాట్లాడుతూ ఆటగాళ్లనుంచి తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పే రోహిత్‌ కెప్టెన్సీ పద్ధతిని నేను నేర్చుకున్నాను’ అని గిల్‌ వివరించాడు. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)