Breaking News

స‌చిన్‌, కోహ్లి స‌ర‌స‌న గిల్‌.. టీమిండియా కెప్టెన్‌గా రికార్డు

Published on Sat, 07/11/2026 - 07:15

టీమిండియా టెస్టు, వ‌న్డే కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. ప్ర‌తిష్టాత్మ‌క వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని రాయ‌ల్ బాక్స్ నుంచి వీక్షించిన నాలుగో భార‌త కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గ‌తంలో భార‌త్ నుంచి స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు కెప్టెన్ హోదాలో రాయ‌ల్ బాక్స్ నుంచి వింబుల్డ‌న్ టోర్నీ మ్యాచ్‌ల‌ను వీక్షించారు. తాజాగా గిల్ వీరి స‌ర‌స‌న చేరాడు. 

శుక్ర‌వారం లండ‌న్‌లోని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్ల‌బ్‌లో జ‌కోవిచ్‌, సిన‌ర్ మ్యాచ్‌ను గిల్ ప్ర‌త్య‌క్షంగా వీక్షించాడు. మ‌రో విశేష‌మేమిటంటే గిల్ ప‌క్క‌నే భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు అత‌డి భార్య అంజ‌లి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు క‌లిసి వింబుల్డ‌న్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

ఇక వీరితో పాటు విండీస్ దిగ్గ‌జ క్రికెట‌ర్ బ్రియాన్ లారా, నెద‌ర్లాండ్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆట‌గాడు వర్గిల్ వాన్ డిక్, బ్రిట‌న్ యాక్ట‌ర్ బెనెడిక్ట్ కంబ‌ర్‌బాచ్‌, హ్యూగ్ లారి, డామియ‌న్ లూయిస్‌లు కూడా రాయ‌ల్ బాక్స్ నుంచి మ్యాచ్‌ను వీక్షించారు. ఇక గిల్ ఇటీవ‌లే సిల్వ‌ర్‌స్టోన్ స‌ర్క్యూట్ వేదిక‌గా జ‌రిగిన బ్రిటీష్ గ్రాండ్‌ప్రిక్స్ టోర్నీకి కూడా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు.

ఇక ప్ర‌స్తుతం టీమిండియా జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీ20 సిరీస్ ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 0-3తో ఇంగ్లండ్‌కు సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇవాళ చివ‌రి మ్యాచ్‌ను సౌతాంప్ట‌న్ వేదిక‌గా ఆడుతోంది. టీ20 సిరీస్ ముగిసిన వెంట‌నే మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ మొద‌లుకానుంది. 

వన్డే సిరీస్‌కు గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జాయిన్ కానుండడంతో జ‌ట్టు ప‌రిపూర్ణం కానుంది. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా ఈ వ‌న్డే సిరీస్‌ను ఉప‌యోగించుకుంటామ‌ని, దక్షిణాఫ్రికా పరిస్థితులకు ఇక్కడి వాతావరణం సరితూగుతుంద‌ని గిల్ వెల్లడించాడు.

 

Read: ఒళ్లు మండిన గాఫ్‌.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక!

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)