Breaking News

ఆసియా కప్‌లో సెహ్వాగ్‌

Published on Tue, 09/09/2025 - 09:59

ఆసియా కప్‌ 2025 కోసం టోర్నీ బ్రాడ్‌కాస్టర్‌ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ బహుభాషా కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో వరల్డ్‌ ఫీడ్‌ (ఇంగ్లీష్‌) అందించడానికి సునీల్‌ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, రాబిన్ ఉతప్ప, వకార్ యూనిస్, వసీం అక్రమ్, బాజిద్ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, సైమన్ డౌల్  ఎంపిక చేయబడ్డారు.

హిందీ ప్యానెల్‌లో వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, అభిషేక్ నాయర్, సబా కరీమ్  సభ్యులుగా ఉన్నారు. తమిళ ప్యానెల్‌లో భరత్ అరుణ్, WV రామన్.. తెలుగు వ్యాఖ్యాతలుగా వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు తదితరులు వ్యవహరిస్తారు.

ప్రత్యేక ఆకర్షణగా వీరూ
కామెంటరీ ప్యానెల్‌ మొత్తంలో భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. సెహ్వాగ్‌ తన స్పష్టమైన అభిప్రాయాలు, హాస్యంతో కూడిన వ్యాఖ్యానంతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తాడు. ఆటగాడిగా ఏరకంగా మెరుపులు మెరిపించాడో, వ్యాఖ్యానంతోనూ అలాగే కట్టిపడేస్తాడు.

కాగా, ఇవాల్టి నుంచే (సెప్టెంబర్‌ 9)ప్రారంభం కాబోయే ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్‌, పాకిస్తాన్‌, ఒమన్‌, యూఏఈ గ్రూప్‌-బిలో ఉండగా.. మిగతా జట్లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. 

ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌, హాంగ్‌కాంగ్‌ తలపడనున్నాయి. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న UAEతో ఆడనుంది. ఈ టోర్నీ మొత్తంలో ప్రత్యేక మ్యాచైన భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 14న జరుగనుంది.

ఈ టోర్నీలో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)