Breaking News

గంభీర్‌.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ

Published on Mon, 11/17/2025 - 10:23

కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో తాము కోరుకున్న పిచ్‌పై టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. బౌలర్లు రాణించినప్పటికి బ్యాటర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు.

కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. ప్రతిష్టాత్మక​ ఈడెన్ గార్డెన్స్‌లో  టీమిండియాకు 12 ఏళ్ల తర్వాత ఇదే తొలి ఓట‌మి. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు క్రికెట్‌ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు కీల‌క సూచ‌న‌లు చేశాడు. స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీని తిరిగి టెస్టు జ‌ట్టులోకి తీసుకోవాల‌ని దాదా కోరాడు.

అతడొక మ్యాచ్‌ విన్నర్‌..
"భార‌త టెస్టు జ‌ట్టులోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు ష‌మీ అన్నిరకాల‌గా అర్హుడు. అతడొక మ్యాచ్‌ విన్నర్‌. ష‌మీతో పాటు మంచి స్పిన్న‌ర్లు జ‌ట్టులో ఉంటే టీమిండియాకు తిరిగుండదు. నాకు గౌతమ్ గంభీర్ అంటే చాలా ఇష్టం. అత‌డు 2007, 2011 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అత‌డికి చాలా అనుభ‌వం ఉంది. గౌత‌మ్ హెడ్ కోచ్ ప‌దవిలో కొన్నాళ్ల పాటు కొన‌సాగుతాడ‌న్న న‌మ్మ‌కం నాకుంది. 

కానీ సొంత‌గ‌డ్డ‌పై ఆడుతున్నప్పడు బ్యాటింగ్‌, బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ల‌ను ఎంచుకోవాలి. పేస్ త్ర‌యం బుమ్రా, సిరాజ్, షమీలు ముగ్గురు జట్టులో ఉండాలి. వీరిపై గంభీర్‌ నమ్మకం ఉంచాలి" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దాదా పేర్కొన్నాడు. కాగా ష‌మీ చివ‌ర‌గా భార‌త త‌రపున టెస్టుల్లో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్-2023 ఫైన‌ల్లో ఆడాడు.

ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా సిరీస్‌ల‌కు ష‌మీ ఎంపిక చేయ‌లేదు.  ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే షమీని పక్కన పెట్టినట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్ప‌టికే చాలాసార్లు స్ప‌ష్టం చేశాడు. కానీ ష‌మీ మాత్రం త‌ను ఫిట్‌గా ఉన్న‌ప్ప‌టికి ఎంపిక చేయ‌డం లేద‌ని సెల‌క్ట‌ర్ల తీరును త‌ప్పుబ‌డుతున్నారు.
చదవండి: IND vs SA: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)