ఢిల్లీ పేలుడు ఘటనపై గౌతమ్‌ గంభీర్‌ దిగ్భ్రాంతి

Published on Tue, 11/11/2025 - 13:06

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ భయంకర పేలుడులో మొత్తం 13 మంది మృతి చెందగా..17 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని గంభీర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గంబీర్ ప్రస్తుతం భారత జట్టుతో పాటు కోల్‌కతాలో ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

భ‌ద్ర‌తా వ‌ల‌యంలో ఈడెన్‌..
కాగా ఢిల్లీ ఘ‌ట‌న నేప‌థ్యంలో కోల్‌క‌తా పోలీస్‌లు అలర్ట్ అయ్యారు. మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ వద్ద భద్రతను  కట్టుదిట్టం చేశారు. తొలి టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నాయి. దీంతో ఆటగాళ్లు బస చేసే హోటల్స్ వద్ద, స్టేడియంకి వెళ్లే మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. సోమవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ చుట్టూ పోలీసులు ప్రత్యేక నాకా తనిఖీలు (NAKA checks) చేశారు. 
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)