Breaking News

అర్ష్‌దీప్‌ 13 బంతుల ఓవర్‌.. గంభీర్ రియాక్షన్‌ వైరల్‌

Published on Fri, 12/12/2025 - 10:31

ముల్లాన్‌పూర్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో టీ20లో టీమిండియాకు ఘోర ప‌రాభవం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 51 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు అయింది. ముఖ్యంగా బౌలింగ్‌లో అయితే మెన్ ఇన్ బ్లూ పూర్తిగా తేలిపోయింది. 

ఒక్క వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌ప్ప మిగితా బౌల‌ర్లు అంద‌రూ అట్ట‌ర్‌ప్లాప్ అయ్యారు. స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అయితే దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ప‌దేప‌దే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ స‌ఫారీ బ్యాట‌ర్ల‌కు టార్గెట్‌గా మారాడు. అస్స‌లు ఏ మాత్రం రిథ‌మ్‌లో కన్పించ‌లేదు.

ఒక ఓవ‌ర్‌లో 13 బంతులు
ప్రోటీస్ ఇన్నింగ్స్ 11వ‌ ఓవ‌ర్ వేసిన  అర్ష్‌దీప్ త‌న చెత్త‌ బౌలింగ్‌తో అంద‌రికి చిరాకు తెప్పించాడు. 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1..  ఆ ఓవ‌ర్‌లో అర్ష్‌దీప్ వేసిన బంతుల వ‌రుస ఇది. ఈ పంజాబీ పేస‌ర్ త‌న  ఓవ‌ర్‌ను పూర్తిచేసేందుకు ఏకంగా 13 బంతులు వేయాల్సి వ‌చ్చింది. 

తొలి బంతిని డికాక్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదగా... మిగతా 5 లీగల్‌ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్‌లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. డగౌట్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సైతం అర్ష్‌దీప్‌పై సీరియ‌స్ అయ్యాడు. ఇదేమి బౌలింగ్ అన్న‌ట్లు రియాక్ష‌న్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

చెత్త రికార్డు..
అంతర్జాతీయ  టీ20  క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన ఆఫ్ఘనిస్తాన్ పేస‌ర్‌ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్‌దీప్ సమం చేశాడు. నవీన్ గత ఏడాది హరారేలో జింబాబ్వేపై ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. అయితే భార‌త్ త‌ర‌పున ఈ చెత్త ఫీట్ సాధించిన తొలి బౌల‌ర్ మాత్రం అర్ష్‌దీపే కావ‌డం గ‌మ‌నార్హం.


చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్‌
 

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)