Breaking News

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్‌

Published on Mon, 06/16/2025 - 16:17

లీడ్స్ వేదిక‌గా జూన్ 20న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి  టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చేసిన హెడ్ కోచ్ గౌతం గంభీర్‌.. తిరిగి మంగళవారం భారత జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఏఎన్‌ఐ వర్గాల సమాచారం ప్రకారం.. గంభీర్ సోమవారం(జూన్ 16) లండన్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది.  కాగా ఈ సిరీస్ కోసం గంభీర్ జూన్ 5న భారత జట్టుతో పాటు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోంది.

అయితే  తన తల్లి గుండెపోటుతో అస్పత్రిలో చేరడంతో గౌతీ ఉన్నపళంగా జూన్ 11న స్వదేశానికి వచ్చేశాడు. ఇప్పుడు అతడి తల్లి ఆరోగ్యం మెరుగుపడడంతో గంభీర్ తిరిగి ఇంగ్లండ్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. ఇక గంభీర్ లేకపోవడంతో భారత జట్టు తమ ప్రా​‍క్టీస్‌ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొనసాగించింది.

క్రిక్ బజ్‌రిపోర్ట్స్ ప్రకారం..  టీమిండియా సన్నాహాలను లక్ష్మణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ భారత జట్టుతో కాకుండా తన వ్యక్తిగత పనుల మీద ఇంగ్లండ్‌కు వెళ్లాడు. కానీ గంభీర్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోవడంతో లక్ష్మణ్  లౌసాన్ నుండి లండన్‌కు వచ్చినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఇక తొలి టెస్టుకు గిల్ సారథ్యంలోని భారత జట్టు అన్నివిధాల సిద్దమైంది. ఈ టెస్టుకు ముందు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో భారత సీనియర్‌, భారత-ఎ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాహుల్‌, గిల్‌, శార్ధూల్ ఠాకూర్ వంటి మెరుగ్గా రాణించారు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్‌?

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)