Breaking News

ఒక‌వేళ అదే జ‌రిగితే గంభీర్ పోస్ట్ ఊస్టింగ్‌!

Published on Sat, 11/09/2024 - 11:49

టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు త‌న ప్ర‌యాణం ఆరంభంలోనే మిశ్ర‌మ ఫ‌లితాలు ఎదుర‌య్యాయి. అత‌డి నేతృత్వంలోనే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు.. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొలిసారి వైట్ వాష్‌కు గురై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.

దీంతో గంభీర్‌కు అందరికి టార్గెట్‌గా మారాడు. గంభీర్ లేనిపోని ప్రయోగాల కారణంగానే భారత్ ఓడిపోయిందని పలువురు మాజీలు కూడా విమర్శించారు. అదేవిధంగా ఈ ఘెర ఓటములపై బీసీసీఐ కూడా గంభీర్ నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రూపంలో గంభీర్‌కు మరో క‌ఠిన స‌వాలు ఎదురుకానుంది. బీజీటీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

అదే జ‌రిగితే గంభీర్ పోస్ట్ ఊస్టింగ్‌!?
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బీజీటీలో ఆసీస్‌ను 4-0 తేడాతో ఓడించాలి. అయితే హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్ భ‌విత‌వ్యం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫ‌లితాలపై ఆధార‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఈ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచినట్లయితే టెస్టు జ‌ట్టు ప్రధాన కోచ్ ప‌ద‌వి నుంచి గంభీర్‌ను త‌ప్పించాల‌ని బీసీసీఐ భావిస్తుందంట‌. 

దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్ర‌కారం.. రెడ్ బాల్ క్రికెట్ కోసం ప్ర‌త్యేకంగా కోచింగ్ స్టాప్‌ను నియ‌మించాల‌ని బీసీసీఐ పెద్ద‌లు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ అదే జ‌రిగితే భార‌త టెస్టు హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెట‌ర్ వీవీయ‌స్ ల‌క్ష్మ‌ణ్ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశ‌ముంది. ల‌క్ష్మ‌ణ్ ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు.
చదవండి: IND vs SA: సంజూతో గొడ‌వ ప‌డ్డ సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌.. ఇచ్చిప‌డేసిన‌ సూర్య‌! వీడియో

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)