ఆసియాక‌ప్ టోర్నీకి ముందు గంభీర్ ప్ర‌త్యేక పూజ‌లు

Published on Fri, 08/15/2025 - 15:04

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను స‌మంగా ముగించి ఊపిరి పీల్చుకున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఆసియాక‌ప్‌-2025 రూపంలో మ‌రో స‌వాలు ఎదురుకానుంది. ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబ‌ర్ 9 నుంచి యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానుంది.

ఈ మెగా ఈవెంట్ కోసం భార‌త జ‌ట్టును ఆగ‌స్టు 19న బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించనుంది. అనంత‌రం చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ విలేక‌రుల స‌మావేశంలో పాల్గోనే అవ‌కాశ‌ముంది. అయితే ఈ టోర్న‌మెంట్ ఆరంభానికి ముందు గౌతమ్ గంభీర్ మధ్యప్రదేశ్‌లోని శ్రీ మహాకాళ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించాడు. 

గంభీర్ శుక్ర‌వారం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో జరిగిన 'భస్మ ఆరతి'కి తన భార్య, కుమార్తెలతో కలిసి హాజరయ్యారు. ఈ ఆలయంలో గంభీర్ కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది.  

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా గంభీర్ ఇంగ్లండ్ టూర్‌కు ముందు అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 10న దుబాయ్‌ వేదికగా యూఏఈతో తలపడనుంది. అనంతం సెప్టెంబర్‌ 14న దాయాది పాకిస్తాన్‌తో తాడో పేడో తెల్చుకోనుంది.

ఆసియాకప్‌-2025కు భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, అక్షర్‌ పటేల్‌, అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, జితేశ్‌ శర్మ
చదవండి: గౌరవ మిలిటరీ ర్యాంకులు పొందిన క్రికెటర్లు వీరే!.. సచిన్‌ ఒక్కడే ప్రత్యేకం

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)