Breaking News

భార‌త్-ద‌క్షిణాఫ్రికా తొలి టెస్టు.. గంభీర్‌ స్పెషల్‌ రిక్వెస్ట్‌

Published on Wed, 11/12/2025 - 11:09

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగంగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెం‍డు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీకి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 

సాధారణంగా భారత జట్టు స్వదేశంలో ఆడే టెస్టులకు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను కోరుకుంటుంది. కానీ ఈసారి మాత్రం ఫుల్ రాంక్ టర్నర్ పిచ్ వద్దని క్యూరేటర్‌కు గంభీర్ చెప్పాడంట. ఈ విషయాన్ని స్వయంగా మఖర్జీనే వెల్లడించాడు. టీమ్ మెనెజ్‌మెంట్ కొంచెం టర్న్ ఉండేలా పిచ్ తాయారు చేయమని సూచించినట్లు అతడు వెల్లడించాడు.

"తొలి టెస్టు కోసం మంచి పిచ్‌ను తాయారు చేశాము. బ్యాటర్లతోపాటు బౌలర్లకూ సహకారం లభిస్తుంది. ఆట సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ వికెట్‌పై బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రతీ హోమ్ టీమ్ కూడా పిచ్ విషయంలో కొన్ని సూచనలు చేస్తారు. 

ఆస్ట్రేలియాలో అయితే ఆతిథ్య జట్టు ఎక్కువ బౌన్స్ ఉండే పిచ్‌లను తాయారు చేయమని అడుగుతారు. అదే భారత జట్టు అయితే టర్న్ ఉండేట్లు కోరుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం వారు ఫుల్ రాంక్ టర్నర్ పిచ్‌ను అడగలేదు. కొద్దిగా టర్న్ ఉండేలా తాయారు చేయమని చెప్పారు. అని మఖర్జీ ఇండియా టూడేతో పేర్కొన్నాడు. 

కాగా మంగళవారం నాడు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ పిచ్‌ను పరిశీలించారు. ఈ వికెట్‌పై వారు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈడెన్‌ గార్డెన్స్‌ ఇటీవల రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్‌లలో పేసర్లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
చదవండి: రోహిత్ శ‌ర్మ అనుహ్య‌ నిర్ణ‌యం..! ఇక మిగిలింది కోహ్లినే?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)