Breaking News

నమీబియా క్రికెట్‌ జట్టు సలహాదారుగా కిర్‌స్టెన్‌

Published on Mon, 12/08/2025 - 08:04

దక్షిణాఫ్రికాకు చెందిన భారత మాజీ హెడ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ను నమీబియా పురుషుల క్రికెట్‌ జట్టు సలహాదారుగా నియమించుకుంది. హెడ్‌ కోచ్‌ క్రెయిగ్‌ విలియమ్స్‌తో కలిసి నమీబియా జట్టు కోసం ఆయన పనిచేయనున్నారు. త్వరలోనే జరిగే టి20 ప్రపంచకప్‌ వరకు కాంట్రాక్టు కుదిరినట్లు నబీబియా క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. 

‘నమీబియాలాంటి నిబద్ధత గల జట్టుతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కొంతకాలంగా నమీబియా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. నాకున్న కోచింగ్‌ అనుభవంతో ఆ జట్టు మరింత రాటుదేలేందుకు, వచ్చే ప్రపంచకప్‌లో రాణించేందుకు కృషి చేస్తాను’ అని కిర్‌స్టెన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

ఈ సఫారీ మాజీ ఓపెనర్‌ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరయ్యారు. 2007లో భారత హెడ్‌ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన కోచింగ్‌లోనే ధోని సేన 2011లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి, రెండోసారి (1983 తర్వాత) విశ్వవిజేతగా నిలిచింది.

తదనంతరం దక్షిణాఫ్రికా సహా పలు జాతీయ జట్లకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. ఐపీఎల్‌ సహా విశ్వవ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌ల్లోనూ పలు ఫ్రాంచైజీలకు కోచ్‌గా, మెంటార్‌గా కిర్‌స్టెన్‌ పనిచేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలలో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా టి20 ప్రపంచకప్‌ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.
చదవండి: ‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’...

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)