Breaking News

టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్‌ గంగూలీ

Published on Tue, 08/05/2025 - 19:43

లండన్‌లోని ది ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టులో టీమిండియా 6 ప‌రుగుల తేడాతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభ‌రితంగా ఐదో రోజు ఆట‌లో టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ విజ‌యానికి 35 ప‌రుగులు కావ‌ల్సిన నేప‌థ్యంలో సిరాజ్ బంతితో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును బోల్తా కొట్టించాడు. 

చివరి రోజు ఆటలో మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ‌తీశాడు. అత‌డితో పాటు ప్ర‌సిద్ద్ కృష్ణ ఓ వికెట్ సాధిం‍చాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ 8 వికెట్లు సాధించాడు. 

కాగా ఓవల్‌లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖ‌రి టెస్టులో గెలిచి భార‌త్ సిరీస్ స‌మం చేస్తుంద‌ని త‌నకు ముందే తెలుసని టీమిండిమా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ అన్నారు.

"నాలుగ‌వ‌ రోజు ఆట ముగిసిన త‌ర్వాత టీమిండియా గెలుస్తుంద‌నే న‌మ్మ‌కం నాకు క‌లిగింది. పిచ్ పేస‌ర్ల‌కు అనుకూలంగా ఉంది. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని గంగూలీ ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్కంఠ‌పోరులో విజ‌యం త‌ర్వాత భార‌త జ‌ట్టును కొనియాడుతూ గంగూలీ ఓ ట్విట్ కూడాచేశాడు.

"అసాధారణ సిరీస్‌. అమోఘమైన ఫలితం. జడేజా, వాషింగ్టన్‌ సుందర్, రిషభ్‌ పంత్, సిరాజ్‌... అందరూ నిలకడగా ఆడారు. భారత జట్టు విజయాల ఆకలితో ఉన్నట్లు మనవాళ్లు తమ ఆటతీరుతో నిరూపించారు" దాదా ఎక్స్‌లో రాసుకొచ్చారు.
చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)