Breaking News

Hyd: అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. ‘ఫార్ములా -ఇ’ రద్దయ్యే ఛాన్స్‌!?

Published on Thu, 12/28/2023 - 13:37

భాగ్యనగరంలో మరోసారి రేసింగ్‌ చూడాలనుకున్న అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌. వచ్చే ఏడాది హైదరాబాద్‌ వేదికగా ఫిబ్రవరిలో జరగాల్సిన ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఇ-ప్రిక్స్ ఫార్ములా- ఇ’ రేసింగ్‌ రద్దు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నుంచి లీగ్‌ నిర్వహణకు ఇంకా అనుమతి రాలేదని 'ఫార్ములా -ఇ' తాజా ప్రకటనలో వెల్లడించింది.

కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ఇ-ప్రిక్స్ రేస్‌ నిర్వహణకు ‘ఫార్ములా -ఇ’ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ‘ఫార్ములా -ఈ’ రేసింగ్‌ నిర్వహణకు చిక్కులు ఏర్పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు 'ఫార్ములా -ఇ' ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇప్పటికే ఫార్ములా ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం కొత్త ప్రభుత్వంతో సమావేశమైనట్లు తెలిపింది. అంతేకాకుండా ఈవెంట్‌ కోసం ఇప్పటికే చాలా సంస్ధలు పెట్టుబడి పెట్టేశాయి అని, ఈ ఏడాది జరిగిన తొలి ఎడిషన్‌ ద్వారా 84 మిలియన్ల డాలర్ల మేర తెలంగాణ ప్రభుత్వం, నిర్వాహకులకు ఆర్ధిక లబ్ది లభించిందని 'ఫార్ములా -ఇ' పేర్కొంది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ వేదికగా  ఫార్ములా-ఇ  కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ తొలి ఎడిషన్‌ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరంలో రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకుపోయాయి. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)