రంజీ క్రికెటర్‌ దుర్మరణం

Published on Sun, 11/02/2025 - 16:33

త్రిపుర రంజీ జట్టు మాజీ కెప్టెన్ రాజేష్ బానిక్ (Rajesh Banik) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ త్రిపుర ప్రాంతంలోని ఆనంద్‌ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. 40 ఏళ్ల బానిక్‌ తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జీవనం సాగించే వాడు. 

నిత్యం కళ్లెదుటే ఉండే బానిక్‌ ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీరవుతున్నారు. బానిక్‌ మరణవార్త భారత క్రికెట్‌ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ బానిక్‌కు నివాళులర్పించింది.

కుడి చేతి వాటం బ్యాటర్‌, అకేషనల్‌ లెగ్‌ స్పిన్నర్‌ అయిన బానిక్‌ 2001-02 సీజన్‌లో త్రిపుర తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే నమ్మదగ్గ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బానిక్‌ 42 మ్యాచ్‌ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 1469 పరుగులు చేశాడు. అలాగే 24 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 378 పరుగులు, 18 టీ20ల్లో 203 పరుగులు చేశాడు. క్రికెటర్‌గా బానిక్‌ కెరీర్‌ 17 ఏళ్ల పాటు సాగింది.

అనంతరం అతడు త్రిపుర అండర్‌-16 జట్టుకు స్టేట్‌ సెలెక్టర్‌గా సేవలందించాడు. అండర్‌-15 రోజుల్లో బానిక్‌ టీమిండియా మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, అంబటి రాయుడుతో డ్రస్సింగ్‌ రూమ్‌ను షేర్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం అగర్తలలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో త్రిపుర జట్టు ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి బానిక్‌ను నివాళులర్పించారు.  

చదవండి: IND vs AUS: టీ20 క్రికెట్‌లో అతి భారీ సిక్స‌ర్‌.. వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్‌
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)