Breaking News

అందరూ అలాంటోళ్లే... బద్నామైంది మాత్రం నేనొక్కడిని!

Published on Tue, 01/09/2024 - 12:00

టీమిండియాలో అందరూ తాగేవాళ్లే.. ఈ వ్యాఖ్యలు చేసిం​ది ఎవరో సాదాసీదా వ్యక్తి కాదు. 2007-12 మధ్యలో టీమిండియా అత్యుత్తమ స్వింగ్‌ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ఆటగాడు ప్రవీణ్‌ కుమార్‌. ఐదేళ్ల పాటు టీమిండియాలో తిరుగులేని బౌలర్‌గా, ఆతర్వాత ఐపీఎల్‌లో అత్యుత్తమ పేసర్‌గా చలామణి అయిన ప్రవీణ్‌ ఆ తర్వాత వివిధ కారణాల చేత కనుమరుగయ్యాడు. ప్రస్తుతం​ రాజకీయాల్లో ఉన్న ప్రవీణ్‌.. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి తన సహచరులపై వివాదాస్పద ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. 

లల్లన్‌టాప్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్‌ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ, నాటి తన టీమిండియా సహచరులు, ప్రత్యేకించి ఓ సీనియర్‌ ఆటగాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే పాకిస్తాన్‌ ఆటగాళ్లపై కూడా ప్రవీణ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. 

టీమిండియాలో చేరిన కొత్తలో పలువురు సీనియర్లు తనను మద్యం సేవించడం మానుకోవాలని సూచించారని ప్రవీణ్‌ అన్నాడు. తనకున్న మద్యం అలవాటు కారణంగా ఓ సీనియర్‌ తనను ప్రత్యేకించి బద్నాం చేసేవాడని ఆరోపించాడు. జట్టులో అందరూ తాగేవాళ్లే అయినప్పటికీ తన పేరును మాత్రమే హైలైట్‌ చేసేవారని వాపోయాడు.   

ఐపీఎల్‌లో తనకు కోచింగ్‌ అవకాశాలు రాకపోవడంపై కూడా ప్రవీణ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాగుతానని సాకుగా చూపి తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్ సైతం తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రౌండ్‌లో కాని డ్రెస్సింగ్‌ రూమ్‌లో కాని  తాను తాగలేదు కదా అని ఎదురు ప్రశ్నించాడు. సరైన గుర్తింపు లేక, అవకాశాలు రాక, కనీసం పలకరించే వారు లేక ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపాడు.

ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడకపోతే తన కెరీర్‌ను నాశనం చేస్తానని నాటి ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోదీ వార్నింగ్‌ ఇచ్చాడని బాంబు పేల్చాడు. తన సొంత పట్టణం మీరట్‌ అయిన కారణంగా తాను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాలనుకున్నానని, అయినా తన అభ్యర్ధనను లలిత్‌ మోదీ పట్టించుకోకుండా బలవంతంగా ఆర్సీబీతో ఒప్పందం కుదిర్చాడని ఆరోపించాడు. 

పాకిస్తాన్‌ బౌలర్లు ఎక్కువగా బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడేవారని ప్రవీణ్‌ ఆరోపించాడు. దాదాపుగా ప్రతి బౌలర్‌ కొద్దోగొప్పో బాల్‌ టాంపరింగ్‌ చేస్తాడని, పాక్‌ బౌలర్లు కాస్త ఎక్కువగా చేసే వారని ప్రవీణ్‌ అన్నాడు. పాక్‌ ఆటగాళ్లు పైకి ఒకలా లోపల మరోలా ఉండేవారని, వారు ఎక్కువగా అబద్దాలాడేవారని తెలిపాడు. 

37 ఏళ్ల ప్రవీణ్‌కు అప్పట్లో అత్యుత్తమ స్వింగ్‌ బౌలర్‌గా గుర్తింపు ఉండేది. ప్రవీణ్‌ టీమిండియా తరఫున 6 టెస్ట్‌లు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ప్రవీణ్‌ 112 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్‌ ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల తరఫున 119 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్‌ చివరిసారిగా 2017లో ఐపీఎల్‌లో ఆడాడు. ఆతర్వాత అవకాశాలు రాకపోవడంతో అతను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయాల్లో ఉన్నాడు. అతను గత యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్‌వాది పార్టీలో చేరాడు. 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)