Breaking News

టీమిండియా మాజీ క్రికెటర్‌పై చీటింగ్‌ కేసు

Published on Sat, 07/25/2026 - 17:48

టీమిండియా మాజీ క్రికెటర్‌ రాజేశ్‌ చౌహాన్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని రూ. 15 లక్షలకు పైగా మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా స్థానిక కోర్టు ఆదేశాల మేరకు జులై 24న మోహన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 316(2) (నమ్మకద్రోహం) కింద కేసు నమోదైంది.

ఆరోపణ ఏంటంటే..?
మాజీ భారత, మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహాన్, జిందాల్ స్టీల్ కంపెనీతో ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టు కుదిర్చిస్తానని దింకర్ విశ్వమిత్ర అనే వ్యక్తికి హామీ ఇచ్చి రూ. 15.1 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణ. ఈ మేరకు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించగా, పోలీస్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చౌహాన్ హామీ ఇచ్చారు. దీంతో 2021 జులైలో చౌహాన్ సంస్థ 'గోవింద్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ'తో విశ్వమిత్ర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట చెక్కు రూపంలో రూ. 2.51 లక్షలు, అనంతరం మిగిలిన రూ. 12 లక్షలను సంస్థ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు.

అయితే పెట్టుబడి అనంతరం చౌహాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఫిర్యాదుదారు నేరుగా జిందాల్ స్టీల్ లిమిటెడ్‌ను సంప్రదించగా, చౌహాన్‌కు కానీ, గోవింద్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి కానీ ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వలేదని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించారు.

చౌహాన్ స్పందన
ఈ వ్యవహారంపై గతంలో పీటీఐతో మాట్లాడిన చౌహాన్, ఇది వ్యాపార వివాదం మాత్రమేనని పేర్కొన్నారు. "ఫిర్యాదుదారుకు చెందిన కొంత మొత్తాన్ని ఇప్పటికే తిరిగి చెల్లించాం. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన మొత్తం చెల్లింపులో ఆలస్యం జరిగింది" అని ఆయన వివరణ ఇచ్చారు.

క్రికెట్ కెరీర్
బిహార్‌లో జన్మించిన రాజేష్ చౌహాన్ 1988/89 నుంచి 2000/01 వరకు మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. 1993లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 21 టెస్టులు, 35 వన్డేలు ఆడి 76 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్‌లో దాదాపు 100 ఫస్ట్-క్లాస్, అంతే సంఖ్యలో లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 400కు పైగా వికెట్లు తీశారు. 2000/01లో క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, 59 ఏళ్ల చౌహాన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)