Breaking News

నీరజ్‌కు చెక్‌.. ఫాస్ట్‌ బౌలర్‌ నుంచి జావెలిన్‌ చాంపియన్‌ దాకా

Published on Sat, 08/01/2026 - 16:43

కామన్వెల్త్ గేమ్స్ 2026లో జావెలిన్ త్రోలో శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, నీరజ్ చోప్రా ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (85.83 మీటర్లు) చేసినప్పటికీ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  

భారత్‌కే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్‌వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. కామన్‌వెల్త్‌లో రుమేశ్‌ స్వర్ణం సాధించడం వెనుక పెద్దగా ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే ఈ ఏడాది రోమ్ డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల మార్కును దాటిన తొలి అథ్లెట్‌గా నిలిచిన పతిరగే, 92.62 మీటర్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ త్రో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

క్రికెటర్ నుంచి జావెలిన్ ఛాంపియన్‌గా..
రుమేశ్‌ పతిరగే ప్రస్థానం ఎంతో ఆసక్తికరమైనది. జావెలిన్ క్రీడలోకి రాకముందు అతను ఒక క్రికెటర్. అండర్-18 కేటగిరీలో శ్రీలంక పేసర్ ఇషాన్ మలింగ తర్వాత గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్‌గా అతనికి పేరుంది. అయితే, కోచ్ టోనీ ప్రసన్న ప్రోత్సాహంతో జావెలిన్‌ వైపు మళ్లినట్లు పతిరగే 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. "నాకు జావెలిన్‌ను పరిచయం చేసింది కోచ్ టోనీనే. ఆయన నాకు క్రీడ గురించే కాదు, జీవితం గురించి కూడా నేర్పించారు" అని పేర్కొన్నాడు.

చదవండి: బాక్సింగ్‌లో డబుల్‌ స్వర్ణాలు.. ట్రిపుల్‌ జంప్‌లో రెండు పతకాలు

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)