Breaking News

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ల అత్యుత్తమ Ind-Eng జట్టు.. కోహ్లికి నో ప్లేస్‌!

Published on Wed, 06/18/2025 - 21:33

క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం టీమిండియా- ఇంగ్లండ్‌ (Ind vs Eng) టెస్టు సిరీస్‌ గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా ఇరుజట్లకు ఇదే తొలి సిరీస్‌. దీనికి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేసింది.

ఇక విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే తొలి సిరీస్‌ కూడా ఇదే. యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో దిగ్గజాలు లేని భారత జట్టు స్టోక్స్‌ బృందాన్ని వారి సొంతగడ్డపై ఢీకొట్టనుంది. జూన్‌ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.

విరాట్‌ కోహ్లికి నో ప్లేస్‌
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు మైకేల్‌ ఆర్థర్‌టన్‌, నాసిర్‌ హుసేన్‌.. 21వ శతాబ్దానికి సంబంధించి భారత్‌- ఇంగ్లండ్‌ ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేశారు. అయితే, వీరిద్దరు సంయుక్తంగా ఎంచుకున్న ఈ జట్టులో టీమిండియా దిగ్గజ బ్యాటర్‌, లెజెండరీ టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి మాత్రం చోటు ఇవ్వలేదు.

ఈ విషయం గురించి నాసిర్‌ హుసేన్‌ మాట్లాడుతూ.. టీమిండియా- ఇంగ్లండ్‌ నుంచి మేము ఎంపిక చేసుకున్న అత్యుత్తమ జట్టులో కోహ్లి లేడు. జో రూట్‌ కూడా లేడు. వారిద్దరు లేకపోవడాన్ని అందరూ జీర్ణించుకోలేకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.

కాగా భారత్‌ నుంచి విధ్వంసకర ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌తో పాటు ‘వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌, దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌, యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌, భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు ప్రస్తుత పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఆర్థర్‌టన్‌, నాసిర్‌ హుసేన్‌ చోటు ఇచ్చారు.

21వ శతాబ్దానికి గానూ ఆర్థర్‌టన్‌, నాసిర్‌ హుసేన్‌ ఎంచుకున్న భారత్‌- ఇంగ్లండ్‌ కంబైన్డ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..
వీరేందర్‌ సెహ్వాగ్‌, అలిస్టర్‌ కుక్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండుల్కర్‌, కెవిన్‌ పీటర్సన్‌, బెన్‌ స్టోక్స్‌, రిషభ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌-2025కి భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ఇవే
భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌/వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌.

ఇంగ్లండ్‌ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్‌ బెతెల్‌, హ్యారీ బ్రూక్, బ్రైడన్‌ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)