Breaking News

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

Published on Mon, 01/26/2026 - 15:33

భారత క్రికెట్‌ పరిపాలనలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇందర్జిత్‌ సింగ్‌ బింద్రా (ఐఎస్ బింద్రా) వయోభారంతో (84 ఏళ్లు) ఆదివారం కన్నుమూశారు. బింద్రా 1993 నుండి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 1978 నుండి 2014 వరకు 36 సంవత్సరాల పాటు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

బింద్రా మరణం భారత క్రికెట్‌ చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికింది. పరిపాలకుడిగా తన దూరదృష్టి, సాహసోపేతమైన నిర్ణయాలతో బింద్రా భారత క్రికెట్‌ను ప్రపంచ వేదికపై తిరుగులేని శక్తిగా నిలిపారు.  

1987 వరల్డ్‌కప్‌ను భారత ఉపఖండానికి తీసుకురావడంలో బింద్రా కీలక పాత్ర పోషించారు. ఇది మొదటిసారి ఇంగ్లండ్‌ వెలుపల జరిగిన వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించిన బింద్రా.. భారత క్రికెట్‌ ఆర్థికస్థితిగతుల రూపురేఖల్ని మార్చారు. 

అనంతరం బింద్రా ప్రోద్భలంతోనే 1996 వరల్డ్‌కప్‌ కూడా భారత ఉపఖండంలో జరిగింది. ఈ ప్రపంచకప్‌ నిర్వహణ ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ కేంద్రస్థానంగా మారడానికి దోహదపడింది.  

ప్రపంచకప్‌ లాంటి ఐసీసీ మెగా టోర్నీలను భారత్‌కు తీసుకురావడంలో సఫలీకృతుడైన బింద్రా.. ప్రసార హక్కుల విషయంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు. 1994లో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించి, దూరదర్శన్‌ ఏకాధికారాన్ని సవాలు చేశారు. ఆ తీర్పుతో ప్రైవేట్‌ మరియు అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత క్రికెట్‌లోకి ప్రవేశించాయి. 

ESPN, TWI వంటి సంస్థలు మార్కెట్లోకి రావడంతో టెలివిజన్‌ ద్వారా క్రికెట్‌ భారత దేశ నలుమూలకు చేరింది. దీంతో ఆదాయాలు పెరిగి, భారత క్రికెట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ మార్కెట్‌గా మారింది. ఈ ఆర్థిక బలమే బీసీసీఐని స్వతంత్రంగా, శక్తివంతంగా నిలబెట్టింది.  

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)