Breaking News

బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌కు తీవ్ర అస్వస్థత

Published on Mon, 11/10/2025 - 14:52

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ (Former Bangladesh Captain), ప్రస్తుత బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన ఫారూఖీ అహ్మద్‌ (Faruque Ahmed) తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఫారూఖీకి నిన్న (నవంబర్‌ 9) మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. 

హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు కార్డియాక్‌ అరెస్ట్‌గా నిర్దారించారు. యాంజియోగ్రామ్‌ చేయగా, గుండె ధమనాల్లో  బ్లాకేజ్‌ గుర్తించారు. చికిత్సలో భాగంగా స్టెంట్‌ వేసి పూడికను తొలగించారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో (CCU) ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఫారూఖీ 1984-1999 మధ్యలో బంగ్లాదేశ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కొంతకాలం ఆ జట్టుకు కెప్టెన్‌గానూ సేవలందించాడు. రిటైర్మెంట్‌ తర్వాత రెండుసార్లు జాతీయ సెలెక్టర్‌గా వ్యవహరించిన అతను.. 2024 అగస్ట్‌లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగానూ పని చేశారు. 

ఈ పదవిలో 9 నెలల పాటు కొనసాగాడు. ఆతర్వాత అమినుల్‌ ఇస్లాం పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. 59 ఏళ్ల ఫారూఖీ ఇటీవలే బీసీబీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

ఫారూఖీ సుదీర్ఘకాలం జాతీయ జట్టులో ఉన్నా కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 105 పరుగులు చేశాడు. ఫారూఖీ కుడి చేతి వాటం బ్యాటింగ్‌తో పాటు పార్ట్‌ టైమ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌గానూ వ్యవహరిం​చేవాడు.

చదవండి: 'అతడొక గన్ ప్లేయర్‌.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి'

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)