Breaking News

హెడ్‌కు ఫిట్‌నెస్‌ పరీక్ష!

Published on Wed, 12/25/2024 - 03:29

మెల్‌బోర్న్‌: భారత్‌తో నాలుగో టెస్టుకు ముందుఆ్రస్టేలియాకు ఆందోళన పెంచే విషయమిది! సిరీస్‌లో చెలరేగిపోతున్న ట్రావిస్‌ హెడ్‌ ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో ఆడటంపై కొంత సందిగ్ధత కనిపిస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హెడ్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్‌కు ఇంకా స్పష్టత రాలేదు. 

మ్యాచ్‌కు ముందు రోజు హెడ్‌కు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడే టీమ్‌ను ప్రకటిస్తారు. ఈ సిరీస్‌లో హెడ్‌ వరుసగా 11, 89, 140, 152, 17 పరుగులు చేశాడు. బ్రిస్బేన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌ సమయంలోనే హెడ్‌ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను ఫీల్డింగ్‌కు కూడా దిగలేదు. సోమవారం ప్రాక్టీస్‌కు పూర్తిగా దూరంగా ఉన్న అతను...మంగళవారం మాత్రం కాసేపే సాధన చేశాడు. 

హెడ్‌ స్థానం ఇంకా ఖాయం లేదని అంగీకరించిన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌... బ్యాటింగ్‌ చేయడంలో ఇబ్బంది లేకపోతే కచ్చితంగా బరిలోకి దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆసీస్‌ తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. మెక్‌స్వీనీ స్థానంలో స్యామ్‌ కొంటాస్‌ అరంగేట్రం చేయనుండగా... హాజల్‌వుడ్‌కు బదులుగా బోలండ్‌ జట్టులోకి వస్తాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)