ఎట్టకేలకు వికెట్‌.. అక్షర్‌ కెరీర్‌లోనే అతి పెద్ద గ్యాప్‌

Published on Fri, 03/10/2023 - 15:22

టీమిండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ వికెట్‌ సాధించాడు. అదేంటి అతను ఒక బౌలర్‌.. వికెట్‌ సాధించడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నబోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో అక్షర్‌ తొలి మూడు టెస్టులు కలిపి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టిన అక్షర్‌ పటేల్‌ టీమిండియా తరపున రెండో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 185 పరుగులు చేసిన అక్షర్‌ ఖాతాలో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

ఆల్‌రౌండర్‌ అనే ట్యాగ్‌ ఉన్న అక్షర్‌ బ్యాట్‌తో రాణించినప్పటికి బంతితో మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచిన ఉస్మాన్‌ ఖవాజా(180 పరుగులు) వికెట్‌ను అక్షర్‌ దక్కించుకోవడం విశేషం. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఖవాజా ఎల్బీగా వెనుదిరిగాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 47.4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన తర్వాత వికెట్‌ పడగొట్టాడు. అక్షర్‌ పటేల్‌ తన టెస్టు కెరీర్‌లో ఒక వికెట్‌ తీయడం కోసం ఎదుర్కొన్న అతిపెద్ద గ్యాప్‌ ఇదే. చివరగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో అక్షర్‌ పటేల్‌ మూడు వికెట్లు తీశాడు.

చదవండి: డెబ్యూ శతకం.. టీమిండియాపైనే బాదాలా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)