Breaking News

చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Sun, 11/10/2024 - 17:20

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్‌ తరఫున కనీసం ఒక్కరు కూడా హాఫ్‌ సెంచరీ మార్కు తాకలేకపోయారు. ఆసీస్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్‌ ఆసీస్‌ టాప్‌ స్కోరర్‌గా జోస్‌ ఇంగ్లిస్‌ నిలిచాడు. ఇంగ్లిస్‌ తొలి వన్డేలో 49 పరుగులు చేశాడు. ఇదే ఈ సిరీస్‌ మొత్తానికి ఆసీస్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌.

పాక్‌తో సిరీస్‌లో బ్యాటర్ల చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఆసీస్‌ 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 22 ఏళ్లలో సొంతగడ్డపై పాకిస్తాన్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోవడం ఆసీస్‌కు ఇదే మొదటిసారి. ఇవాళ (నవంబర్‌ 10) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్‌ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. 31.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ పేసర్లు షాహీన్‌ అఫ్రిది (3/32), నసీం షా (3/54), హరీస్‌ రౌఫ్‌ (2/24), మొహమ్మద్‌ హస్నైన్‌ (1/24) ఆసీస్‌ పతనాన్ని శాశించారు.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో సీన్‌ అబాట్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్‌ (22), ఆరోన్‌ హార్డీ (12), ఆడమ్‌ జంపా (13), స్పెన్సర్‌ జాన్సన్‌ (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌..  26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో సైమ్‌ అయూబ్‌ (42), అబ్దుల్లా షఫీక్‌ (37) రాణించగా.. బాబర్‌ ఆజమ్‌ (28), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (30) అజేయంగా నిలిచారు. ఆసీస్‌ బౌలర్లలో లాన్స్‌ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్‌ తొలి వన్డేలో గెలుపొందగా.. పాక్‌ వరుసగా రెండు, మూడు వన్డేల్లో గెలిచింది.

ఈ సిరీస్‌లో ఆసీస్‌ బ్యాటర్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
జోస్‌ ఇంగ్లిస్‌- 49 (తొలి వన్డే)
స్టీవ్‌ స్మిత్‌- 44 (తొలి వన్డే)
స్టీవ్‌ స్మిత్‌- 35 (రెండో వన్డే)
పాట్‌ కమిన్స్‌- 32 (తొలి వన్డే)
సీన్‌ అబాట్‌- 30 (మూడో వన్డే)

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)