Breaking News

WI Vs PAK: 148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలా.. బ్యాట్‌తో రికార్డు సృష్టించిన విండీస్‌ బౌలర్లు

Published on Tue, 01/21/2025 - 12:58

148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు.. తొలి ఎనిమిది మంది ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోర్‌ చేశారు. టెస్ట్‌ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌తో తాజాగా ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌లో విండీస్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోని చివరి ముగ్గురు ఆటగాళ్లు గుడకేశ్‌ మోటీ, జోమెల్‌ వార్రకన్‌, జేడెన్‌ సీల్స్‌ వరుసగా 19, 31 (నాటౌట్‌), జేడెన్‌ సీల్స్‌ 22 పరుగులు చేశారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో వీరికి మించి ఎవరూ స్కోర్‌ చేయలేదు. 

టాప్‌-8 బ్యాటర్స్‌లో అత్యధిక స్కోర్‌ 11 పరుగులు మాత్రమే. ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, ఎనిమిదో నంబర్‌ ఆటగాడు కెవిన్‌ సింక్లెయిర్‌ తలో 11 పరుగులు చేశారు. మిగతా ఆరుగురు ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 66 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో చివరి ముగ్గురు బ్యాటర్లు ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును మూడంకెల స్కోర్‌ (137) దాటించారు.

ఇక్కడ మరో ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్లుగా నిలిచిన చివరి ముగ్గురు రెండో ఇ​న్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ పాకిస్తాన్‌ చేతిలో చిత్తుగా ఓడినా విండీస్‌ బౌలర్లు బ్యాట్‌తో సరికొత్త రికార్డు సృష్టించారు. 

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ చివరి ఇద్దరు ఆటగాళ్లు మరో రికార్డు నెలకొల్పారు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో (ఓ ఇన్నింగ్స్‌లో) చివరి ఇద్దరు ఆటగాళ్లు (జోమెల్‌ వార్రకన్‌ (31 నాటౌట్‌), జేడెన్‌ సీల్స్‌ 22) టాప్‌ స్కోరర్లుగా నిలవడం ఇది మూడోసారి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్తాన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది.  కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో పాక్‌ స్పిన్‌ త్రయం సాజిద్‌ ఖాన్‌ (9 వికెట్లు), నౌమన్‌ అలీ (6 వికెట్లు), అబ్రార్‌ అహ్మద్‌ (5 వికెట్లు) మొత్తం 20 వికెట్లు పడగొట్టింది. 

వెస్టిండీస్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైన పాక్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ స్పిన్నర్‌ జోమెల్‌ వార్రికన్‌ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మరో రికార్డు కూడా నమోదైంది. పాక్‌ గడ్డపై అతి పొట్టి టెస్ట్‌ మ్యాచ్‌గా (బంతుల పరంగా) ఈ మ్యాచ్‌ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌ కేవలం 1064 బంతుల్లోముగిసింది.

ఓవరాల్‌గా టెస్ట్‌ క్రికెట్‌లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌గా భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టెస్ట్‌ మ్యాచ్‌ నిలిచింది. ఈ మ్యాచ్‌ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)