చరిత్రకు చేరువలో..

Published on Thu, 06/27/2024 - 03:25

తరూబా (ట్రినిడాడ్‌): ఓ ఆసక్తికర సెమీస్‌ సమరం, ఓ కొత్త ఫైనలిస్టుకు వేదికైన ఈ ప్రపంచకప్‌లో అటు దక్షిణాఫ్రికా, ఇటు అఫ్గానిస్తాన్‌ ఎవరు ఫైనల్‌ చేరతారో గురువారం మధ్యాహ్నంలోపు తెలిసిపోతుంది. మెగా ఈవెంట్‌లోనే మేటి జట్లను తోసిరాజని బాగా ఆకట్టుకున్న ఏకైక జట్టు అఫ్గానిస్తాన్‌. తమ ఆట ఆషామాషీగా లేదని, సంచలన విజయాలు గాలివాటం కానేకాదని రషీద్‌ ఖాన్‌ బృందం నిరూపిస్తోంది. 

ఆతిథ్య విండీస్, పటిష్ట న్యూజిలాండ్‌ ఉన్న గ్రూప్‌ ‘సి’లో లీగ్‌ దశనే అఫ్గానిస్తాన్‌ దాటడం గొప్పనుకుంటే... ‘సూపర్‌–8’లో ఏకంగా 2021 చాంపియన్‌ ఆ్రస్టేలియానే కంగుతినిపించడం, బంగ్లాదేశ్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న ఆఖరి మ్యాచ్‌లో పోరాడి గెలవడం క్రికెట్‌ చరిత్రలోనే నిలిచేలా చేసింది. అఫ్గాన్‌ సెమీస్‌ చేరడంతోనే రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు ఫైనల్‌ చేరి చరిత్ర పుటల్లోకెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. 

ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమష్టిగా రాణిస్తుండటం అఫ్గాన్‌ పెను సంచలనాలకు కారణం కాగా... మరోవైపు గట్టి జట్టయిన దక్షిణాఫ్రికా మాత్రం ప్రతి మ్యాచ్‌ను కష్టపడుతూనే గెలుపొందడం విడ్డూరం. నెదర్లాండ్స్‌పై 103 పరుగుల లక్ష్యాన్ని 19వ ఓవర్లో ఛేదించడం, బంగ్లాదేశ్‌పై 4 పరుగులు, నేపాల్‌తో ఒక పరుగు తేడాతో గట్టెక్కడం సఫారీ స్థాయిని తక్కువ చేస్తోంది. 

తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన అమెరికాపై 194/4లాంటి భారీస్కోరు చేసినా కేవలం 18 పరుగులతోనే గెలుపొందడం... ఇలా ప్రతీ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా పెద్ద పెద్ద పోరాటాలే చేసింది. ఇలాంటి జట్టుపై జోరుమీదున్న అఫ్గాన్‌ గెలిస్తే సంచలనమైతే అవుతుందేమో కానీ ఇందులో పెద్ద విశేషమైతే ఉండదు. మొత్తం మీద తొలి ఫైనల్‌ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. 

జట్లు (అంచనా) 
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్, రబాడ, నోర్జే, షమ్సీ.

అఫ్గానిస్తాన్‌: రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, అజ్మతుల్లా, గుల్బదిన్, నబీ, కరీమ్, నంగేయలియా, నూర్‌ అహ్మద్, నవీనుల్‌ హక్, ఫరూఖీ.    

2 దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు టి20 మ్యాచ్‌లు జరగ్గా... రెండింటిలోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. 2010 ప్రపంచకప్‌లో 59 పరుగులతో, 2016 ప్రపంచకప్‌లో 37 పరుగులతో దక్షిణాఫ్రికా నెగ్గింది. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)