Breaking News

FIH Pro League: ‘షూటౌట్‌’లో భారత్‌ విజయం

Published on Tue, 02/20/2024 - 10:09

FIH Pro League 2023-24- భువనేశ్వర్‌: పురుషుల ప్రొ హాకీ లీగ్‌ టోర్నీలో భారత జట్టు నాలుగో విజయం అందుకుంది. స్పెయిన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సడెన్‌డెత్‌ ‘షూటౌట్‌’లో 8–7తో గెలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి.

భారత్‌ తరఫున జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (1వ ని.లో), అభిషేక్‌ (35వ ని.లో)... స్పెయిన్‌ తరఫున జోస్‌ బస్టెరా (3వ ని.లో), బొర్యా లకెలా (15వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. స్కోర్లు సమమయ్యాక విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ను నిర్వహించారు. ‘

షూటౌట్‌’లో తొలి ఐదు ప్రయత్నాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. దాంతో ‘సడెన్‌డెత్‌’ షూటౌట్‌ను నిర్వహించారు. ‘సడెన్‌డెత్‌’లో స్పెయిన్‌ ప్లేయర్‌ మిరాలెస్‌ తీసుకున్న మూడో షాట్‌ను భారత గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ నిలువరించాడు.

ఆ వెంటనే భారత్‌ తరఫున లలిత్‌ ఉపాధ్యాయ్‌ గోల్‌ చేయడంతో టీమిండియా విజయం ఖరారైంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో భారత్‌ ఐదు మ్యాచ్‌ల ద్వారా 10 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. రేపు జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్‌ ఆడుతుంది.

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ బోణీ
చెన్నై: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు గెలుపు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్‌ హాక్స్‌ 7–15, 12–15, 15–10, 15–11, 20–18తో ముంబై మెటోర్స్‌ జట్టును ఓడించింది. తొలి రెండు సెట్‌లు ఓడిపోయిన బ్లాక్‌ హాక్స్‌ ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకొని వరుసగా మూడు సెట్‌లు నెగ్గి విజయాన్ని అందుకుంది. భ్లాక్‌ హాక్స్‌ విజయంలో అష్మతుల్లా, హేమంత్, లాల్‌ సుజన్‌ కీలకపాత్ర పోషించారు.

గుల్‌వీర్‌ సింగ్‌కు స్వర్ణం
టెహ్రాన్‌: ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌ను భారత్‌ స్వర్ణ పతకంతో ముగించింది. సోమవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల రేసులో భారత అథ్లెట్‌ గుల్‌వీర్‌ సింగ్‌ (8ని:07.48 సెకన్లు) పసిడి పతకం గెలిచాడు. మహిళల 3000 మీటర్లలో అంకిత (9ని:26.22 సెకన్లు) రజత పతకం సాధించింది. ఈ పోటీల్లో భారత్‌కు మొత్తం నాలుగు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)