Breaking News

అరంగేట్రంలోనే అదరగొట్టిన ఇషాన్‌ కిషన్‌

Published on Mon, 06/23/2025 - 16:36

టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ కౌంటీ క్రికెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే మెరుపు హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కేవలం 57 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 83 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 

కౌంటీల్లో ఇషాన్‌కు ఇదే తొలి అసైన్‌మెంట్‌. ఇటీవలే అతను నాటింగ్హమ్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టుతో ఇషాన్‌ ఒప్పందం కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కైల్ వెర్రెయిన్ జాతీయ విధులు హాజరయ్యేందుకు జింబాబ్వేకు వెళ్లడంతో (రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం) నాటింగ్హమ్‌షైర్‌ ఇషాన్‌తో స్వల్ప కాలిక ఒప్పందం చేసుకుంది. 

డివిజన్‌–1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా నాటింగ్హమ్‌షైర్‌ యార్క్‌షైర్‌తో తలపడుతుంది. రెండో రోజు తొలి సెషన్‌లో నాటింగ్హమ్‌షైర్‌ 348/6గా ఉంది. ఇషాన్‌, లియామ్‌ పాటర్సన్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు నాటింగ్హమ్‌ ఇన్నింగ్స్‌లో హసబ్‌ హమీద్‌ 52, బెన్‌ స్లేటర్‌ 96, ఫ్రెడ్డీ 23, జో క్లార్క్‌ 31, జాక్‌ హేన్స్‌ 18, లిండన్‌ జేమ్స్‌ 12 పరుగులు చేసి ఔటయ్యారు. యార్క్‌షైర్‌ బౌలర్లలో జార్జ్‌ హిల్‌, డేనియల్‌ మోరియార్టీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్‌ వైట్‌, విలయమ్‌ ఓరూర్కీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

10 రోజుల్లో మూడో ఆటగాడు..
10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఒప్పందం కుద‌ర్చుకున్న మూడో భార‌త ఆట‌గాడిగా ఇషాన్‌ కిషన్‌ నిలిచాడు. కిష‌న్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్‌షైర్, హాంప్‌షైర్‌లతో  జ‌తక‌ట్టారు.

ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గ‌తేడాది బీసీసీఐ నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇషాన్‌.. తిరిగి ఈ ఏడాది తన కాం‍ట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు.

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఇషాన్‌కు పిలుపు వచ్చే అవకాశముంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)