Breaking News

FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది!

Published on Tue, 11/29/2022 - 04:10

దోహా: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలో జర్మనీది ఘనచరిత్రే! బ్రెజిల్‌ అంతటి మేటి జట్టు జర్మనీ. బ్రెజిల్‌ ఐదుసార్లు గెలిస్తే... జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను అందుకుంది. అంతేకాదు గెలిచినన్ని సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలిచింది. ఇలా పాల్గొన్న ప్రతీ మెగా ఈవెంట్లోనూ సత్తా చాటుకున్న మేటి జట్టు గత టోర్నీలో తొలి రౌండ్‌ దాటకపోవడమే పెద్ద షాక్‌ అనుకుంటే మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటుంది. స్పెయిన్‌తో జరిగిన లీగ్‌ పోరులో జర్మనీ 1–1తో డ్రాతో గట్టెక్కింది.

స్పెయిన్‌ తరఫున సబ్‌స్టిట్యూట్‌ అల్వారో మొరాటా (62వ ని.లో), జర్మనీ జట్టులో సబ్‌స్టిట్యూట్‌ ఫుల్క్‌రుగ్‌ (83వ ని.లో) గోల్‌ చేశారు. ఇప్పుడు ఒక ఓటమి, ఒక డ్రాతో ఉన్న జర్మనీ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కోస్టారికాను ఓడిస్తేనే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఈ గ్రూపులో ఆఖరి లీగ్‌ పోటీల్లో కోస్టారికాతో జర్మనీ... జపాన్‌తో స్పెయిన్‌ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్‌లు గురువారమే జరుగనున్నాయి. దీంతో ఇంకో రెండు రోజుల్లో ఏ రెండు ముందుకో, ఏ రెండు ఇంటికో తేలిపోతుంది. 

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)