ఫిఫా వరల్డ్‌కప్‌.. ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా

Published on Thu, 07/16/2026 - 02:37

ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. అట్లాంటా వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో విజ‌యం సాధించిన అర్జెంటీనా.. స్పెయిన్‌తో తుది పోరుకు అర్హత సాధించింది. 

ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని ఇంగ్లండ్ డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మెస్సీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికి బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపలేకపోయాడు. ఇంగ్లండ్ కూడా ప్రథమార్ధంలో గోల్ సాధించలేకపోయింది.

దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇరు జట్లు తమ ఖాతాను తెరవలేదు. అయితే సెకెండ్ హాఫ్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. యువ సంచలనం ఆంథోనీ గోర్డాన్ 58 నిమిషంలో ఒక సూపర్‌ గోల్‌తో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం దగ్గరపడుతున్నప్పటికి అర్జెంటీనా ఇంకా గోల్ సాధించకపోవడంతో డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఓటమి తప్పదని అంతా భావించారు.

అర్జెంటీనా అదరహో
ఈ సమయంలో అర్జెంటీనా అద్బుత‌మైన క‌మ్‌బ్యాక్ ఇచ్చింది. ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు అర్జెంటీనా ఆటగాళ్లు విశ్వరూపం ప్ర‌ద‌ర్శించారు. 85వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ డి-బాక్స్ లాంగ్-రేంజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. అనంత‌రం అద‌న‌పు స‌మ‌యం(90+2)లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ చేశాడు.

మైదానం మధ్యలో నుంచి ఇంగ్లండ్‌ డిఫెన్స్‌ను త‌ప్పించుకుంటూ మెస్సీ అందించిన ఒక అద్భుతమైన క్రాస్ పాస్‌ను.. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖ‌రి నిమిషాల్లో ఇంగ్లండ్ మ‌రో గోల్ సాధించ‌క‌పోవ‌డంతో మెస్సీ సేన వ‌రుస‌గా రెండో సారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం(జూలై 20) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా త‌ల‌ప‌డ‌నుంది.
 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)