పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!
Breaking News
ఫిఫా తెచ్చిన తంటా.. ఆ బీర్లకు నోస్టాక్ బోర్డు!
Published on Fri, 06/19/2026 - 08:54
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ నడుస్తోంది. 48 దేశాలు పాల్గొంటున్న ఫిఫాను ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకిస్తోంది. ఫుట్‌బాల్ ఆటలో గోల్స్ వర్షంలో తడిసి ముద్దవుతున్న అభిమానులు ఆ సంతోషంలో లెక్కకు మించి కేసులకు కేసుల బీర్లు తాగేస్తున్నారు. స్కాట్లాండ్ 28 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
దీనికి తోడు టోర్నీలో హైతీతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు 1-0తో గెలిచింది. అసలే ప్రపంచకప్‌కు అర్హత సాధించామన్న సంతోషాన్ని ఈ విజయం ఆ దేశ అభిమానుల్లో జోష్‌ను రెట్టింపు చేసింది. దీంతో స్కాట్లాండ్ అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ముఖ్యంగా పదివేల మంది స్కాట్లాండ్ మద్దతుదారులతో ఏర్పడిన ‘టార్జాన్ ఆర్మీ’ మసాచుసెట్స్ నగరానికి తరలివచ్చింది.
విజయం ఇచ్చిన కిక్‌తో బోస్టన్ వీధుల్లో ఉన్న అనేక బార్లలో ఉన్న ‘బోస్టన్ లాగర్’ బీర్లను తాగేశారు. బోస్టన్ లాగర్ బీర్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం నాలుగు రోజుల్లోనే 4వేల పింట్లు ఖాళీ అయినట్లు తెలిపింది. ఒక దశలో బీర్లకు డిమాండ్ పెరిగిపోవడంతో కంపెనీ అనేక అత్యవసర డెలివరీలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది.
గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడని వ్యాపారం కేవలం నాలుగు రోజుల్లోనే తాము చూశామని, డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయడానికి మాకు కష్టమైనప్పటికీ ఆ టార్గెట్‌ను రీచ్ అయ్యామని బార్ నిర్వాహకుల్లో ఒకరు తెలిపారు. అయితే టార్జాన్ ఆర్మీ దెబ్బకు కొన్ని బార్లలో బోస్టన్ లాగర్ బీర్లకు సంబంధించి నోస్టాక్ బోర్డులు కనిపించడం విశేషం.
ఇక టార్జాన్ ఆర్మీ పేరిట బోస్టన్‌లో అడుగుపెట్టిన స్కాట్లాండ్ అభిమానుల బృందం బ్యాగ్‌పైప్ గ్రూప్ సహకారంతో నగరంలో ఫ్యాన్ మార్చ్ నిర్వహించి, ఆ తర్వాత బోస్టన్ రెడ్సాక్స్లోని పెన్వై పార్క్‌కు చేరుకొని అక్కడ స్కాట్లాండ్ థీమ్‌తో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. గ్రూప్-సిలో ఉన్న స్కాట్లాండ్ తమ తర్వాతి మ్యాచ్‌ను శనివారం మొరాకొతో ఆడనుంది.
The Scotland fans are not letting the rain in Boston stop the party ! pic.twitter.com/ZqSXls8gmb
— LIMBZ (@LimbzHQ) June 19, 2026
The Tartan Army is at Fenway Park tonight! 🏴
(via @MLB)pic.twitter.com/qDWiqelBYh— FOX Sports: MLB (@MLBONFOX) June 15, 2026
Tags : 1