Breaking News

బెల్జియం చిత్తు.. సెమీఫైనల్లో స్పెయిన్

Published on Sat, 07/11/2026 - 02:35

బాస్ ఏంజిలిస్: ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో స్పెయిన్ జ‌ట్టు 16 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున ఫాబియన్ రూయిజ్ (30వ నిమిషంలో), సబ్ స్టిట్యూట్ మికెల్ మదీనో 88వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. 

బెల్జియం జట్టుకు చార్లెస్ కెటెలార్ (41వ నిమిషం లో) ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 16 సార్లు బెల్జియం గోల్‌పోస్టుపై దాడి చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చివరిసారి స్పెయిన్ జట్టు 2010లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆ ఏడాదే తొలిసారి  ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. 

1986 ప్రపంచకప్‌లోనూ స్పెయిన్, బెల్జియం జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడగా..పెనాల్టీ షూటౌట్'లో బెల్జియం 5- 4తో స్పెయిన్‌ను ఓడించింది. తాజా విజయంతో స్పెయిన్ 40 ఏళ్ల తర్వాత బెల్జియం చేతిలో ఎదురైన పరాజయానికి లెక్క సరి చేసింది. బుధవారం డాలస్లో జరిగే తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టుతో స్పెయిన్ తలపడుతుంది.
 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)