Breaking News

సెమీస్‌ చేరిన ఫ్రాన్స్‌కు భారీ షాక్!?

Published on Fri, 07/10/2026 - 09:44

ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీలో మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌ సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో మొరాకోను 2-0తో చిత్తు చేసి.. ఎనిమిదోసారి సెమీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. బోస్టన్‌ వేదికగా శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ కెప్టెన్‌ కిలియన్‌ ఎంబాపే అదరగొట్టాడు.

తొలుత 26వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను వృథా చేసినప్పటికీ.. 60వ నిమిషంలో ఎంబాపె గోల్‌ కొట్టడంతో ఫ్రాన్స్‌ ఖాతా తెరిచింది. ఇక 66వ నిమిషంలో డెంబెలె మరో గోల్‌ గొట్టి మొరాకోకు షాకిచ్చాడు. ఆ తర్వాత మొరాకోను నిలువరించడంలో సఫలమైన ఫ్రాన్స్‌.. ఈసారి టాప్‌-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

ఊహించని షాక్‌
ఇదిలా ఉంటే.. గోల్‌ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కిలియన్‌ ఎంబాపె గాయపడటం కలకలం రేపింది. మ్యాచ్‌ రెండో అర్ధ భాగం 77వ నిమిషంలో ఎంబాపె మడిమ నొప్పితో విలవిల్లాడాడు. 

దీంతో ఫ్రాన్స్‌ మేనేజర్‌ డిడెర్‌ డెచాంప్స్‌ ఫిలిప్‌ మటేటాను ఎంబాపే స్థానంలో మైదానంలోకి పంపగా.. ఎంబాపె బయటకు వచ్చాడు. ఈ క్రమంలో మటేటా మిగిలిన 13 నిమిషాలు మైదానంలో ఉండగా.. ఎంబాపె తిరిగి వెళ్లలేదు.

ఊపిరి పీల్చుకో!
దీంతో సెమీస్‌ చేరిన ఆనందంలో ఉన్న ఫ్రాన్స్‌కు ఊహించని షాక్‌ తగిలినట్లయింది. అయితే, తన గాయంపై ఎంబాపె స్పందిస్తూ.. అభిమానులకు ఊరట కలిగించే విషయం చెప్పాడు.

‘‘నేను బాగానే ఉన్నాను. నా చీలమండకు దెబ్బ తగిలింది. అయితే, ఇప్పుడు అంతా బాగానే ఉంది.నాకంటే కూడా మటేటా ఆఖరి 15 నిమిషాల మ్యాచ్‌ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా, సన్నద్ధంగా ఉన్నాడు’’ అని ఎంబాపె చమత్కరించాడు.

చదవండి: నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)