Breaking News

నరాలు తెగే ఉత్కంఠ.. అదిరిపోయే హైడ్రామాలో అర్జెంటీనా గెలుపు

Published on Sat, 07/04/2026 - 06:56

ఫిఫా వరల్డ్ కప్ వేదికగా జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఊహించని ఉత్కంఠ నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్స్ అర్జెంటీనా..   కేప్ వెర్డే లాంటి జట్టుతో చివరిదాకా పోరాడాల్సి వచ్చింది. ఒక దశలో మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందోనని ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూశారు. హోరాహోరీ పోరులో.. చివరకు  3-2 తేడాతో అర్జెంటీనా కాబో వెర్డె (Cabo Verdy)ను ఓడించి రౌండ్ ఆఫ్-16లో అడుగుపెట్టింది.

ఫిఫా వరల్డ్‌ కప్‌ 2026లో భాగంగా..  మియామి హార్డ్‌రాక్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఆద్యంతం ఉత్కంఠను పంచింది. ప్రారంభంలో అర్జెంటీనా ఆధిపత్యం చాటింది. అయితే ఒక్క గోల్‌ పడకుండా కాబో వెర్డె రక్షణ గోడలా నిలబడి అడ్డుకుంది. ఈ క్రమంలో 29వ నిమిషంలో మెస్సీ Lionel Messi అద్భుతమైన టచ్‌తో గోల్ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగం 1-0తో ముగిసింది.

రెండో అర్ధభాగంలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వెనక్కి తగ్గని కాబో వెర్డె ఫాస్టెస్ట్‌ కౌంటర్ అటాక్స్‌తో అర్జెంటీనాను ఒత్తిడిలోకి నెట్టింది. ఆట 59వ నిమిషంలో డెరోయ్ డువార్టే గోల్‌తో స్కోర్‌ను 1-1 చేసింది. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ పోరుగా మారి ఉత్కంఠను పెంచింది.

అర్జెంటీనా తరఫున మెస్సీ, లౌటారో మార్టినెజ్ ప్రయత్నాలు చేసినా.. కాబో వెర్డె గోల్‌కీపర్ వోజిన్హా అద్భుత సేవ్‌లతో నిలబడ్డాడు. నిర్ణీత 90 నిమిషాల్లో విజేత తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడే అసలైన డ్రామా మొదలైంది.

అదనపు సమయం ప్రారంభమైన వెంటనే 93వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా మళ్లీ ముందంజలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 103వ నిమిషంలో లారోస్ కాబ్రాల్ అద్భుతమైన షాట్‌తో కాబో వెర్డెను మళ్లీ సమం చేశాడు.

కానీ ఈ ఉత్కంఠ అక్కడితో ఆగలేదు. 111వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో ‘హెడర్ గోల్‌’తో(మెస్సీ ఇచ్చిన కార్నర్‌ను రొమెరో తలతో గోల్‌గా మార్చాడు) అర్జెంటీనా మరోసారి ఆధిక్యం సాధించింది. చివరి నిమిషాల్లో కాబో వెర్డె వరుస ఎటాక్స్‌ చేసినా.. ఎమిలియానో మార్టినెజ్ అద్భుత సేవ్‌లతో గోడలా నిలబడ్డాడు. చివరికి 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టింది. 

అయితే.. గెలుపు డిఫెండింగ్ ఛాంపియన్‌దే అయినా అల్ప జనాభా ఉన్న చిన్న దేశమైనా కాబో వెర్డె చూపిన పోరాటం ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకట్టుకుంది. ఆఫ్రికా పడమటి తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న చిన్న దీవుల దేశం కాబో వెర్డె.. ఫిఫా గ్రూప్ దశ నుండి నాకౌట్ వరకు ఇచ్చిన పోరాటం, పెద్ద జట్లను ఒత్తిడిలోకి నెట్టిన తీరు, సాకర్‌ సమరంలో గుర్తుండిపోయే “అండర్‌డాగ్ స్టోరీ”గా నిలిచింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)