Breaking News

#Hardhikpandya: అయ్యో హార్దిక్‌.. నీకే ఎందుకిలా! నీకు మేము ఉన్నాము

Published on Fri, 07/19/2024 - 08:13

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అటు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ, ఇటు ప్రొఫెషనల్‌గాను హార్దిక్‌ గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ టీ20ల‌కు విడ్కోలు ప‌ల‌కడంతో భార‌త త‌దుపురి టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అంతా భావించారు.

కానీ బీసీసీఐ మాత్రం పాండ్యాకు ఊహించ‌ని షాకిచ్చింది. బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ టీమిండియా టీ20 కెప్టెన్‌గా పాండ్యాను కాద‌ని స్టార్ క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ను నియ‌మించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక సంద‌ర్భంగా బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

అయితే శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు జ‌ట్టు ప్రక‌టించిన కొద్ది సేపటికే హార్దిక్ మ‌రో బాంబు పేల్చాడు. గ‌త కొన్ని నెల‌ల‌గా త‌మ వైవాహిక జీవితానికి సంబంధించి వ‌స్తున్న రూమ‌ర్స్‌ను హార్దిక్ పాండ్యా, అత‌డి  భార్య నటాషా స్టాంకోవిచ్ నిజం చేశారు. హార్దిక్‌ పాండ్య- న‌టాషా తామిద్ద‌రూ విడిపోతున్న‌ట్లు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేశారు. 

"మా 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాము. మేము క‌లిసిండేందుకు అన్ని విధాల ప్ర‌య‌త్నం చేశాము. కానీ విడిపోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని మేమిద్ద‌రం భావించాము. పర‌స్ప‌ర గౌర‌వం, ఆనందంతో క‌లిసి ఒక కుటంబంగా ఎదిగిన త‌ర్వాత విడిపోవ‌డం నిజంగా క‌ష్ట‌మే. 

కానీ ఈ కఠినమైన నిర్ణయం తీసుకొక త‌ప్ప‌ట్ల‌లేదు. మా ఇద్ద‌రి జీవితాల్లోనూ అగస్త్య భాగంగా ఉంటాడు. అగస్త్యకు కో పెరెంట్‌గా మేము కొన‌సాగుతాం. అతని ఆనందం కోసం మేం ఏమైనా చేస్తాం. ఈ క్లిష్టమైన సమయంలో మాకు మీ మద్దతు కావాలి. మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని ప్రకటనలో హార్దిక్, నటాషా పేర్కొన్నారు. 

అయితే ఈ క్టిష్ట‌స‌మ‌యంలో హార్దిక్‌కు అభిమానులు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. క‌మాన్ హార్దిక్‌.. నీకు మేము ఉన్నాము అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. మ‌రి కొంద‌రు అయ్యో హార్దిక్‌.. నీకేందుకు ఇన్ని క‌ష్టాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2024 సమయంలోనూ పాండ్యా దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన పాండ్యా అటు సార‌థిగా, ఇటు ఆట‌గాడిగా విఫ‌ల‌య్యాడు. దీంతో పాండ్యాను దారుణంగా ట్రోలు చేశారు. అయితే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పాండ్యా దుమ్ములేప‌డంతో ఒక్క‌సారిగా హీరో అయిపోయాడు. తిట్టిన‌ నోళ్లే అత‌డిని ప్ర‌శించాయి.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)