Breaking News

5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?

Published on Sun, 07/09/2023 - 10:44

మాములుగా క్రికెట్‌లో ఐదు ఓవర్లు బౌలింగ్‌ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్‌ ట్రోపీ సెమీఫైనల్‌లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

అయితే సౌత్‌ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్‌ కెప్టెన్‌ జయంత్‌ యాదవ్‌ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు.  మ్యాచ్‌ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్‌ ముందంజ వేసేది.

కానీ సౌత్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్‌ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్‌ (15 నాటౌట్‌) మ్యాచ్‌ ముగించడం విశేషం. అయితే నార్త్‌జోన్‌ కెప్టెన్‌ జయంత్‌ యాదవ్‌ వైఖరిపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్‌ చేశారు.. 

సౌత్‌జోన్‌ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్‌ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్‌ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్‌ వర్మ, సాయికిషోర్‌లు జట్టును విజయతీరాలకు చేర్చారు.

చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్‌-21 చాంపియన్‌ ఇంగ్లండ్‌

Womens Ashes 2023: యాషెస్‌ సిరీస్‌ విజేతగా ఇంగ్లండ్‌.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్‌ ఓటమి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)