Breaking News

ఛీ.. అపార్థం చేసుకున్నావు! ధోనిని అవమానించావు.. నీకేం తక్కువ చేశాం?

Published on Wed, 05/24/2023 - 13:59

IPL 2023- CSK In Final- Ravindra Jadeja: ఐపీఎల్‌-2022లో మహేంద్ర సింగ్‌ ధోని నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ పగ్గాలు చేపట్టిన టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మధ్యలోనే వైదొలిగాడు. అతడి సారథ్యంలో జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో తిరిగి ధోనినే మళ్లీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

అవమానకర రీతిలో
డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సీఎస్‌కే పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. నాలుగు సార్లు టైటిల్‌ విజేతగా నిలిచిన ధోని సేన అత్యంత అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

నిజానికి జడ్డూకు బాధ్యతలు అప్పగించేందుకు ధోని ఫ్రాంఛైజీని ఒప్పించడం సహా తన వారసుడిగా నిలబెట్టేందుకు తనకున్న ప్రాధాన్యం తగ్గించుకుని మరీ రిటెన్షన్‌ లిస్టులో మొదటి స్థానం కల్పించాడు. ఇంతా చేస్తే కెప్టెన్సీ అనుభవం లేని జడేజా మధ్యలోనే పగ్గాలు వదిలేశాడు.

రీఎంట్రీలో అదుర్స్‌
ఇక ఐపీఎల్‌-2022లో వైఫల్యం తర్వాత ఆసియా కప్‌-2022 సందర్భంగా సత్తా చాటిన జడ్డూ గాయం కారణంగా మధ్యలోనే టీమిండియాకు దూరమయ్యాడు. తర్వాత రీఎంట్రీ ఇచ్చి దేశవాళీ క్రికెట్‌లో సత్తా భారత జట్టులో తిరిగి ప్రవేశించాడు. ఐపీఎల్‌-2023లోనూ పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. 175 పరుగులు చేయడం సహా.. 19 వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో రాణించి జట్టు విజయాల్లో తన వంతు  పాత్ర పోషించాడు. ఇక గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం నాటి తొలి క్వాలిఫయర్‌లోనూ సత్తా చాటాడు.

విలువైన ఆస్తి
చెపాక్‌ మ్యాచ్‌లో 16 బంతుల్లో 22 పరుగులు సాధించిన జడ్డూ.. 4 ఓవర్ల బౌలంగ్‌ కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసి టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, దసున్‌ షనక రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో అప్‌స్టాక్స్‌ మోస్ట్‌ వాల్యూబుల్‌ అసెట్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. కానీ.. అవార్డు తీసుకున్న అనంతరం జడేజా చేసిన ట్వీట్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కాగా ధోని ఈ సీజన్‌ ఆఖరిదన్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్‌ తలా బ్యాటింగ్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

ధోని మీద ప్రేమ మాత్రమే! నీపై ద్వేషం కాదు
ఈ క్రమంలో జడ్డూను త్వరగా అవుట్‌ కావాలని.. అలా అయితే ధోని క్రీజులోకి వచ్చి షాట్లు కొడితే చూడాలని ప్లకార్డుల రూపంలో తమ కోరికను బయటపెట్టారు. కానీ జడేజా దీనిని సీరియస్‌గా తీసుకున్నాడు. తనను అగౌరవపరుస్తున్నారన్న ఉద్దేశంలో.. ‘‘అప్‌స్టాక్స్‌కు తెలిసింది కానీ.. కొంతమంది ఫ్యాన్స్‌కు తెలియలేదు’’ అంటూ తను జట్టుకు విలువైన ఆస్తినని చెప్పకనే చెప్పాడు.

నిజానికి, ఫ్యాన్స్‌ అలా చేయడంలో ధోని మీద ప్రేమే తప్ప జడ్డూపై ఏమాత్రం ద్వేషం లేదన్నది వాస్తవం. కానీ జడేజా ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. అందుకే ఇలా ట్వీట్‌ చేశాడు. ఆ మధ్య జడ్డూ భార్య రివాబా కూడా కౌంటర్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ఫ్యాన్స్‌ రవీంద్ర జడేజాపై ఫైర్‌ అవుతున్నారు.

ఛీ.. అపార్థం చేసుకున్నావు! ఒకరకంగా ధోనిని అవమానించావు!
‘‘ఈ విశ్వంలో ఉన్న క్రికెటర్లందరిలో అత్యంత అభద్రతాభావానికి లోనయ్యే ఆటగాడివి నువ్వే! నీకేం తక్కువైంది. సీఎస్‌కే ఫస్ట్‌ రిటెన్షన్‌ నువ్వు. ధోని వారసుడిగా నీ మీద మేమెంతో ప్రేమాభిమానాలు చూపించాం. నీ ఆటను ఆస్వాదించాం. నీ పేరును ట్రెండ్‌ చేశాం.

జడ్డూను వదిలేయండి ప్లీజ్‌
ప్రతిసారి నిన్ను ఎంకరేజ్‌ చేశాం. మేమేదో తలా కోసం ఆరాటపడితే దానిని కూడా తప్పుగా అర్థం చేసుకుని మమ్మల్ని, మాతో పాటు ధోని కించపరిచేలా మాట్లాడతావా?’’ అంటూ మండిపడుతున్నారు. ఇకనైనా జడేజాను వేరే ఫ్రాంఛైజీకి వెళ్లేలా అతడి వదిలేయాలంటూ సీఎస్‌కే యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌పై గెలుపొందిన చెన్నై పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ధోని సేనపై ప్రశంసలు వెల్లువెతుత్తున్నాయి.

చదవండి: మా వాళ్లకు చుక్కలు చూపిస్తా.. విసిగిస్తా! పాపం వాళ్ల పరిస్థితి చూస్తే: ధోని
ఫైనల్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. ధోనిపై నిషేధం! ఏం జరగనుంది?

Videos

ఎక్కడికైనా వెళ్తామ్.. ఉగ్రవాదులను అంతం చేస్తామ్

ఒంగోలులో మంత్రి నారా లోకేశ్ కు నిరసన సెగ

ఏంటీ త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాకు అలాంటి టైటిలా?

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్

సింహాచలం ఘటనలో మృతుల కుటుంబానికి YSRCP తరుపున ఆర్థిక సహాయం అందజేత

సమస్య చెప్పు కోవడానికి వచ్చిన రైతు పట్ల మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

మురళీ నాయక్ మరణం తీరని లోటు YSRCP వెంకటరామి రెడ్డి కామెంట్స్

సుప్రీంకోర్టు తీర్పుపై పలు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి

KSR Live Show: పథకాలకు నో మనీ.. జల్సాలకు ఫుల్ మనీ..!

హైదరాబాద్ సహా పలు చోట్ల మోస్తారు వర్షం

Photos

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)