Breaking News

ఇదేం చెత్త ఆట బ్రో.. ఐపీఎల్‌లోనే ఆడుతావా! ఫ్యాన్స్ ఫైర్‌

Published on Mon, 11/11/2024 - 09:30

టీమిండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న పేలవ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. డ‌ర్బ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20లో కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచిన అభిషేక్‌.. ఇప్పుడు పోర్ట్ ఎలిజిబెత్‌లో జ‌రిగిన రెండో టీ20లో కూడా అదే తీరును క‌న‌బ‌రిచాడు.

 ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన అభిషేక్‌ కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. స‌ఫారీ పేస‌ర్ కోయిట్జీ బౌలింగ్‌లో చెత్త ఆడి ఈ పంజాబీ స్టార్ బ్యాట‌ర్ ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిషేక్ శ‌ర్మ‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇదేమి ఆట భ‌య్యా..కేవ‌లం ఐపీఎల్‌లోనే ఆడుతావా? అంటే ఓ యూజ‌ర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మ‌రి కొంత‌మంది అత‌డి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ అవ‌కాశం ఇవ్వండి అంటూ భార‌త జ‌ట్టు మేనెజ్‌మెంట్‌ను సూచిస్తున్నారు.

ఒక్క సెంచ‌రీ మిన‌హా.. 
కాగా జింబాబ్వే సిరీస్‌తో టీ20తో అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్ శ‌ర్మ ఇప్పుడు భార‌త్ త‌ర‌పున 9 మ్యాచ్‌లు ఆడాడు. అయితే జింబాబ్వే సిరీస్‌లో సెంచ‌రీ మిన‌హా ఇప్ప‌టివ‌ర‌కు అభిషేక్ చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న  చేయ‌లేకపోయాడు. 

జైశ్వాల్‌కు బ్యాక‌ప్‌గా జ‌ట్టులోకి వ‌చ్చిన ఈ యువ ఆట‌గాడు త‌న మార్క్‌ను చూపించడంలో విఫ‌ల‌మ‌య్యాడు. 24 ఏళ్ల అభిషేక్ శ‌ర్మ తన తొమ్మిది టీ20 ఇన్నింగ్స్‌లలో ఎనిమిదింటిలో క‌నీసం 20 పరుగుల మార్కును కూడా దాట‌లేక‌పోయాడు. దీంతో జ‌ట్టులో అత‌డి స్ధానం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తానే అభిషేక్ జ‌ట్టులో కొన‌సాగే అవ‌కాశముంది.

ఐపీఎల్‌లో అదుర్స్‌
ఐపీఎల్‌-2024లో మాత్రం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌రపున అభిషేక్ శర్మ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్  200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. కానీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఆ దూకుడును అభిషేక్ ప్ర‌ద‌ర్శించలేక‌పోతున్నాడు.

చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)