చరిత్ర సృష్టించిన నేపాల్‌ బౌలర్‌

Published on Sun, 02/08/2026 - 17:44

నేపాల్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ షేర్‌ మల్లా చరిత్ర సృష్టించాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి బంతికే వికెట్‌ తీసి అత్యంత​ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతను మల్లా ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో సాధించడం మరింత ప్రత్యేకం. 

మల్లాకు ముందు కేవలం ఐదుగురు (ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌, ప్రగ్యాన్‌ ఓఝా, పరాస్‌ ఖడ్కా, నదీమ్‌ అహ్మద్‌, ఖుర్రమ్‌ ఖాన్‌) మాత్రమే ప్రపంచకప్‌ టోర్నీలో (కెరీర్‌లో) తొలి బంతికే వికెట్‌ తీశారు. వీరిలోనూ ఓ నేపాల్‌ బౌలర్‌ (పరాస్‌ ఖడ్కా) ఉన్నాడు. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. మల్లాకు ముందు మరో ముగ్గురు (పరాస్‌ ఖడ్కా, ఆరిఫ్‌ షేక్‌, కుశాల్‌ భుర్టెల్‌) నేపాల్‌ ఆటగాళ్లు కూడా కెరీర్‌లో తొలి బంతికే వికెట్‌ తీశారు.

కాగా, టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌ ఇవాళ (ఫిబ్రవరి 8) ఆడుతుంది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జేకబ్‌ బేతెల్‌ (55), హ్యారీ బ్రూక్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. 

ఆఖర్లో విల్‌ జాక్స్‌ (38 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ 1, జోస్‌ బట్లర్‌ 26, టామ్‌ బాంటన్‌ 2, సామ్‌ కర్రన్‌ 2, జోఫ్రా ఆర్చర్‌ ఒక్క పరుగు చేశారు. నేపాల్‌ బౌలర్లలో నందన్‌ యాదవ్‌, దీపేంద్ర సింగ్‌ ఎయిరీ తలో 2 వికెట్లు తీయగా.. షేర్‌ మల్లా, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. మల్లా తొలి వికెట్‌ ఫిల్‌ సాల్ట్‌.

అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్‌ 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. భుర్టెల్‌ (29), ఆసిఫ్‌ షేక్‌ (7) ఔట్‌ కాగా.. రోహిత్‌ పౌడెల్‌ (10), దీపేంద్ర సింగ్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. డాసన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలవాలంటే మరో 78 బంతుల్లో 125 పరుగులు చేయాలి. 
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)