Breaking News

Ind vs Pak: అతడితో జాగ్రత్త: టీమిండియాకు కైఫ్‌ వార్నింగ్‌

Published on Tue, 06/04/2024 - 17:08

టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 5న ఈ మ్యాచ్‌ జరుగనుంది. అయితే, ఆ మరుసటి మ్యాచ్‌లో రోహిత్‌ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.

ఈ మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్‌ జూన్‌ 9న నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ రోహిత్‌ సేనకు కీలక సూచనలు చేశాడు.

పాకిస్తాన్‌పై గెలవడం టీమిండియాకు తేలికేనన్న కైఫ్‌.. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లున్న దాయాదితో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ‘‘పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ బలహీనంగా ఉందని మనకు తెలుసు.

కానీ ఫఖర్‌ జమాన్‌ క్రీజులో కుదురుకున్నాడంటే ఫాస్ట్‌గా ఆడతాడు. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేయగలడు. ఇఫ్తికార్‌ అహ్మద్‌ కూడా బాగానే ఆడతాడు. మిగతావాళ్ల స్ట్రైక్‌రేటు 120- 125 మధ్య ఉంటుంది.

కాబట్టి వాళ్ల బ్యాటింగ్‌ గురించి మనం అస్సలు భయపడాల్సిన పనేలేదు. అయితే, వాళ్ల బౌలింగ్‌ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా నసీం షా.

అతడు ఇండియాలో వరల్డ్‌కప్‌ ఆడలేదు. గాయం కారణంగా అప్పుడు జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. మ్యాచ్‌ జరిగే న్యూయార్క్‌ పిచ్‌ బౌన్సీగా కనిపిస్తోంది.

నిజానికి నసీం షా మంచి బౌలర్‌. గత మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌లో నసీం షా ఫస్ట్‌ స్పెల్‌ అద్భుతంగా వేసిన తీరు చూశాం కదా!’’ అంటూ మహ్మద్‌ కైఫ్‌ టీమిండియాను హెచ్చరించాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో వ్యాఖ్యలు చేశాడు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)