Breaking News

ఇలాంటి తప్పెలా చేశావు గిల్‌?.. యువీ తండ్రి అసంతృప్తి!

Published on Fri, 07/04/2025 - 13:01

టీమిండియా కెప్టెన్‌, డ‌బుల్ సెంచూరియాన్ శుబ్‌మ‌న్ గిల్‌( Shubman Gill)పై మాజీ క్రికెటర్‌ యువ‌రాజ్ తండ్రి యోగ‌రాజ్ ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశాడు. ఎడ్జ్ బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో గిల్ ట్రిపుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశం కోల్పోవడం ప‌ట్ల యోగ‌రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో గిల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు.  387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 269 ప‌రుగులు చేశాడు. తన మొదటి ట్రిపుల్ సెంచరీకి 31 ప‌రుగుల దూరంలో శుబ్‌మ‌న్ నిలిచిపోయాడు. ఇంగ్లండ్ పేస‌ర్ జోష్ టాంగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి త‌న వికెట్‌ను కోల్పోయాడు.

"యువ‌రాజ్ సింగ్(Yuvraj Singh) త‌న కెరీర్‌లో ఏమి సాధించాడో, దానిని ఆట‌గాళ్ల‌కు శిక్ష‌ణ రూపంలో అందించ‌డం చాలా సంతోషంగా ఉంది. శుబ్‌మ‌న్ గిల్‌, అభిషేక్ శ‌ర్మ‌, అర్ష‌దీప్ సింగ్ వంటి యువ ఆట‌గాళ్లను యువ‌రాజ్ త‌న శిక్ష‌ణ‌తో రాటుదేల్చాడు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మ‌న్ 200 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను 250 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండాలని నేను కోరుకున్నాను.

250 ప‌రుగుల మార్క్ చేరుకున్నాక ట్రిపుల్ సెంచ‌రీ చేసి ఆజేయంగా ఉండాల‌ని ఆశించాను. కానీ గిల్ అంత‌లోనే గిల్ ఔట్ కావ‌డంతో నేను బాధ‌ప‌డ్డాను. యువ‌రాజ్ కూడా నిరాశ‌చెందాడు. అంత‌ భారీ స్కోర్ సాధించాక అలా ఔట్ కావ‌డం పెద్దం నేరం. రెండు వందులు అవ్వొచ్చు, మూడు వంద‌లు అవ్చొచ్చు ఏదైనా కానీ నాటౌట్‌గా ఉంటే మ‌న త‌ప్పిదాల‌ను సరిదిద్దుకోవ‌చ్చు.

ఇక శుబ్‌మ‌న్ గిల్ కోసం చాలా మంది చాలా విష‌యాలు మాట్లాడారు. వారంద‌రికి ఒక్క విష‌యం చెప్పాల‌నకుంటున్నాను. దయచేసి మీరు క్రికెటర్ కాక‌పోతే, ఆ విష‌యం గురించి మాట్లాడకండి. గిల్ ఒక టాప్ క్లాస్ ప్లేయ‌ర్. గిల్‌కు 400 పరుగులు చేసే సత్తా కూడా ఉంది" అని ఎన్ఐకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యోగ‌రాజ్ పేర్కొన్నాడు.
చదవండి: 'ఇదంతా అత‌డి వ‌ల్లే'.. గిల్‌ డబుల్‌ సెంచరీ వెనక మాస్టర్‌ మైండ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)