Breaking News

యూరో కప్‌-2024 సెమీస్‌ బెర్తులు ఖరారు..

Published on Mon, 07/08/2024 - 09:15

జర్మనీ వేదిక‌గా జ‌రుగుతున్న యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ-2024లో సెమీఫైనల్‌ బెర్త్‌లు అధికారకంగా ఖరారయ్యాయి. శ‌నివారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భరితంగా సాగిన‌ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన ఇంగ్లండ్ మూడో జ‌ట్టుగా సెమీస్‌కు అర్హ‌త సాధించ‌గా.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టర్కీని ఓడించి నెద‌ర్లాండ్స్ నాలుగో జ‌ట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.

ఇంగ్లండ్‌-స్విట్జర్లాండ్‌ మ్యాచ్‌ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్‌లో ఇంగ్లండ్‌ 5 గోల్స్‌ చేయగా స్విస్‌ జట్టు 3 గోల్స్‌కే పరిమితమై ఓట‌మి చ‌వి చూసింది. మ‌రోవైపు నాలుగో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 2-1తో టర్కీని ఓడించింది.

కాగా యూరో క‌ప్ సెమీఫైన‌ల్లో నెద‌ర్లాండ్స్  అడుగుపెట్ట‌డం 20 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. కాగా ఇప్ప‌టికే ఫ్రాన్స్‌, స్పెయిన్ త‌మ సెమీఫైన‌ల్స్ బెర్త్‌ల‌ను ఖారారు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌ మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్‌; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్‌ తలపడతాయి.   
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)