Breaking News

అభిమానానికి గుర్తుగా గిఫ్ట్‌; గుక్కపట్టి ఏడ్చేసిన అమ్మాయి

Published on Fri, 07/09/2021 - 13:26

లండన్‌: యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020లో ఇంగ్లండ్‌, డెన్మార్క్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ మాసన్‌ మౌంట్‌ మ్యాచ్‌ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2-1 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించి 55 ఏళ్ల తర్వాత మరో మెగాటోర్నీలో ఫైనల్‌కు అడుగుపెట్టింది.

ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్‌ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది.

ఇదంతా చూసిన మిగతావాళ్లు.. '' మీ తండ్రీ కూతుళ్లు అదృష్టవంతులు.. ఇది సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన సమయం'' అంటూ కంగ్రాట్స్‌ చెప్పారు.  కాగా ఈ వీడియోనూ రెమ్‌ విలియ్స్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేయగా ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ దాదాపు 6.7 మిలియన్‌ వ్యూస్‌ రాగా.. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మెగాటోర్నీలో ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్‌ జూలై 11న ఇటలీతో టైటిల్‌ పోరుకు తలపడనుంది. 

Videos

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)