Breaking News

ప‌దేళ్ల క్రిత‌మే భార‌త్‌ను దెబ్బకొట్టిన ఎర్లింగ్ హాలండ్‌

Published on Mon, 07/06/2026 - 21:52

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఎర్లింగ్ హాలండ్ పేరే వినిపిస్తోంది. ఐదుసార్లు ఫిఫా చాంపియ‌న్‌గా నిలిచిన బ్రెజిల్‌ను నార్వే రౌండ్ ఆఫ్ 16 (ప్రిక్వార్ట‌ర్స్‌)లోనే నాకౌట్ చేయ‌డం వెనుక ఎర్లింగ్ హాలండ్ కొట్టిన రెండు గోల్స్ ప్ర‌ధాన కార‌ణంగా నిలిచాయి. అయితే 1998లో తొలిసారి నార్వే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొంది.

అప్ప‌టి నుంచి నాలుగుసార్లు మాత్ర‌మే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన నార్వే ఏనాడు నాకౌట్ ద‌శ‌లో అడుగుపెట్ట‌లేదు. కానీ ఈసారి మాత్రం ప్రిక్వార్ట‌ర్‌లో బ‌ల‌మైన బ్రెజిల్‌ను ఓడించిన నార్వే క్వార్టర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టింది. క్వార్ట‌ర్స్‌లో నార్వే మాజీ చాంపియ‌న్ ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. అయితే 1998లో తొలిసారి ఫిఫా ఆడిన‌ప్పుడు ఎర్లింగ్ హాలండ్ ఇంకా పుట్ట‌నే లేదు. 

క‌ట్‌చేస్తే నాలుగోసారి ఫిఫా ఆడుతున్న నార్వే జ‌ట్టులో ఎర్లింగ్ హాలండ్ ఒక సూప‌ర్‌స్టార్‌. అలాంటి ఎర్లింగ్ హాలండ్‌.. ఒక‌ప్పుడు నార్వే అండ‌ర్‌-17 టీమ్ త‌ర‌ఫున‌ భార‌త జ‌ట్టుతో ఫుట్‌బాల్‌ మ్యాచ్ ఆడ‌డం ఇప్ప‌డు వైర‌ల్‌గా మారింది. ఆనాటి మ్యాచ్‌లో నార్వే 2-0తో భార‌త్‌పై విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో ఎర్లింగ్ హాలండ్ 57వ నిమిషంలో తొలి గోల్ కొట్ట‌గా, 80వ నిమిషంలో ఎరిక్ బోథీమ్ మ‌రో గోల్ కొట్టాడు. 

అయితే మొద‌టి హాఫ్ ముగిసిన త‌ర్వాత భార‌త ఆట‌గాడు సంజీవ్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో రెండోసారి యెల్లో కార్డ్‌కు గుర‌వ్వ‌డంతో భార‌త జ‌ట్టు ప‌ది మందితోనే ఆడాల్సి వ‌చ్చింది. కాగా ఎర్లింగ్ హాలండ్ గోల్ కొడుతున్న అప్ప‌టి ఫొటో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అయితే 2017 ఫిఫా అండ‌ర్‌-17 ప్ర‌పంచ‌క‌ప్‌కు కేవ‌లం ఏడాది స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో అన్ని జ‌ట్లు త‌మ మ్యాచ్‌ల్లో మునిగితేలాయి. 

అప్పుడు ఎర్లింగ్ హాలండ్ నార్వే అండ‌ర్‌-17 త‌ర‌ఫున‌, బ్రెజిల్ అండ‌ర్-17 త‌ర‌ఫున వినిసియ‌స్ జూనియ‌ర్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు త‌మ జ‌ట్ల త‌ర‌ఫున 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో సోమ‌వారం ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డ‌డం విశేషం. ఎర్లింగ్‌ హాలాండ్ సారథ్యంలోని నార్వే ఫీఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు సన్నద్ధమవుతుంది. మరోవైపు భారత ఫుట్‌బాల్ జట్టు మాత్రం ఇప్పటివరకు ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫిఫాలోని 211 సభ్య దేశాల్లో భారతదేశం 138వ ర్యాంకులో కొనసాగుతోంది.

చదవండి: బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సంచ‌ల‌న విజ‌యం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)