Breaking News

కెప్టెన్ సెంచ‌రీ వృధా.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Published on Thu, 05/22/2025 - 17:57

వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు విజ‌యంతో ఆరంభించింది. కాంటర్బరీ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో విండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అమ్మాయిల జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు చేసింది.

విండీస్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ హీలీ మాథ్యూస్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగారు. మిగితా బ్యాట‌ర్లు విఫ‌ల‌మైన‌ప్ప‌టికి మాథ్యూస్ మాత్రం ఇంగ్లీష్ బౌల‌ర్ల‌ను ఊతికారేసారు. మాథ్యూస్ 67 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 100 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో లారెన్ బెల్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఆర్లోట్, స్మిత్‌, వాంగ్ త‌లా వికెట్ సాధించారు.

అనంత‌రం 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ సోఫియా డంక్లి(56 బంతుల్లో 12 ఫోర్ల‌తో 81) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. హీథ‌ర్ నైట్‌(27 బంతుల్లో 6 ఫోర్ల‌తో 43 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. విండీస్ బౌల‌ర్ల‌లో జేమ్స్‌, ఫ్లేచ‌ర్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు. మిగితా బౌల‌ర్లంద‌రూ చేతులెత్తేశారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మే 23న కౌంటీ గ్రౌండ్, హోవ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. భార‌త జ‌ట్టులోకి స్టార్ ప్లేయ‌ర్‌! ఎవరంటే?

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)