Breaking News

నాకు ఇలానే జ‌రిగింది.. అదే అయితే పంత్ ఆడ‌డం క‌ష్ట‌మే: పాంటింగ్‌

Published on Thu, 07/24/2025 - 11:27

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు.

బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి పంత్ కుడి కాలి పాదానికి బలంగా తాకింది. వెంటనే పత్యేక వాహనంలో పంత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. స్కాన్ రిపోర్ట్‌లు కోసం బీసీసీఐ వైద్య బృందం ఎదురు చూస్తోంది.

ఒకవేళ అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే అది భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ కానుంది. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్న పంత్‌.. ఈ మ్యాచ్‌తో పాటు ఆఖరి టెస్టు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.

"రిషబ్ పంత్  కుడి కాలి పాదానికి బలంగా బంతి తాకింది. దెబ్బ తాకిన పంత్‌ తన కాలును నేలపై పెట్టలేకపోయాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం మైదానంలో లోపలికి వచ్చేముందు అతడు కొద్ది నిమిషాల పాటు అటు ఇటు తిరిగాడు. అయితే వెంటనే వాపు రావడం నాకు ఆందోళన కలిగించింది.

గ‌తంలో నాకు ఓ సారి ఇటువంటి గాయ‌మే అయింది. పాదంలో చిన్న చిన్న పెళుసుగా ఉండే ఎముకలు ఉంటాయి. బంతి తాక‌డంతో అందులో ఒక‌ట్రెండు విరిగిపోయాయి. అలా జ‌రిగితే కాలు కింద పెట్టలేము. ఒక‌వేళ పంత్ విష‌యంలో అదే జ‌రిగితే అత‌డు ఈ మ్యాచ్ నుంచి వైదొల‌గ‌క త‌ప్ప‌దు. అలా అత‌డు తిరిగి బ్యాటింగ్‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ తిరిగొచ్చిన‌ ఇటువంటి రివర్స్ స్వీప్ షాట్లు ఆడ‌డ‌ని నేను ఆశిస్తున్నా అని స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్‌
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)