Breaking News

స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

Published on Tue, 04/16/2024 - 09:40

ఇంగ్లండ్‌ స్పిన్‌ దిగ్గజం డెరిక్‌ అండర్‌వుడ్‌ (78) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా డెరిక్‌ తుదిశ్వాస విడిచాడని తెలుస్తుంది. 1966-82 మధ్య ఇంగ్లండ్‌ తరఫున 86 టెస్ట్‌ల్లో 297 వికెట్లు పడగొట్టిన డెరిక్‌.. ఆ జట్టు తరఫున నేటికి అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్‌ బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. అలాగే డెరిక్‌ ఇంగ్లండ్‌ తరఫున ఆరో అత్యధిక వికెట్‌ టేకర్‌గానూ కొనసాగుతున్నాడు. 

కౌంటీల్లో కెంట్‌కు సుదీర్ఘకాలం పాటు (1963-87) ప్రాతనిథ్యం వహించిన డెరిక్‌​.. ఆ జట్టు తరఫున 900కు పైగా మ్యాచ్‌లు ఆడి 2523 వికెట్లు పడగొట్టాడు. 17 ఏళ్ల వయసులోనే కెంట్‌కు ఆడటం మొదలుపెట్టిన డెరిక్‌.. 25 ఏళ్ల వయసులోపే 1000 ఫస్ట్‌ క్లాస్‌ వికెట్లు పడగొట్టి రికార్డుల్లోకెక్కాడు. డెరిక్‌ కెంట్‌ తరఫున ఓ సీజన్‌లో 100కు పైగా వికెట్ల ఘనతను 10 సార్లు సాధించాడు. 1966 సీజన్‌లో డెరిక్‌ ఏకంగా 157 వికెట్లు పడగొట్టాడు. డెరిక్‌ 1966, 1967, 1978, 1979 సంవత్సరాల్లో ఇంగ్లండ్‌ లీడింగ్‌ బౌలర్‌గా కొనసాగాడు. డెరిక్‌ 1969 సెప్టెంబర్‌ నుంచి 1973 ఆగస్ట్‌ వరకు ఐసీసీ టెస్ట్‌ బౌలర్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా చలామణి అయ్యాడు. 

ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు వన్డేల్లో సైతం ప్రాతినిథ్యం వహించిన డెరిక్‌.. ఈ ఫార్మాట్‌లో 26 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. డెరిక్‌ 1975 వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లండ్‌కు ఆడాడు. వికెట్లు పడగొట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్న డెరిక్‌.. 2009లో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌గా ఎంపికయ్యాడు. డెరిక్‌ 2006లో కెంట్‌ క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా.. 2008లో ఎంసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. డెరిక్‌ మరణం కెంట్‌ క్రికెట్‌ కుటుంబానికి తీరని లోటు అని క్లబ్‌ ప్రస్తుత అధ్యక్షుడు సైమన్‌ ఫిలిప్‌ సంతాప ప్రకటన విడుదల చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు