Breaking News

కరుణ్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ భారీ స్కోర్‌

Published on Sun, 06/01/2025 - 08:16

కాంటర్‌బరీ వేదికగా ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న మొద‌టి అన‌ధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చి ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైన కరుణ్‌ నాయర్‌ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కరుణ్‌ నాయర్‌ 281 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 204 ప‌రుగులు చేశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 409/3తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ ‘ఎ’ చివరకు 125.1 ఓవర్లలో 557 పరుగులకు ఆలౌటైంది.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురేల్‌ (120 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్‌) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (7) విఫలమయ్యాడు. శార్దుల్‌ ఠాకూర్‌ (27), హర్ష్‌ దూబే (32), అన్షుల్‌ కంబోజ్‌ (23) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ లయన్స్‌ బౌలర్లలో జోష్‌ హాల్, జమాన్‌ అక్తర్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టామ్‌ హైన్స్‌ (147 బంతుల్లో 103 నాటౌట్‌; 11 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... మ్యాక్స్‌ హోల్డెన్‌ (61 బంతుల్లో 64 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ఎమిలియో (46) ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‌లో సత్తాచాటిన భారత ‘ఎ’ ఆటగాళ్లు... బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లండ్‌ లయన్స్‌ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు.

అన్షుల్‌ కంబోజ్, హర్ష్‌ దూబే చెరో వికెట్‌ పడగొట్టగా... ముకేశ్‌ కుమార్, హర్షిత్‌ రాణా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో 3 ఓవర్లే వేసి 27 పరుగులు సమరి్పంచుకున్నాడు. నాలుగు రోజుల ఈ పోరులో... చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టు భారత్‌ ‘ఎ’ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది. టామ్‌ హైన్స్, హోల్డన్‌ క్రీజులో ఉన్నారు. మూడో రోజు భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం కనబరుస్తారో చూడాలి.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌ టూర్‌.. టీమిండియా మేనేజ‌ర్‌గా యుధ్‌వీర్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)