Breaking News

టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్‌

Published on Mon, 09/02/2024 - 15:05

లార్డ్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్‌కు 29వది. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు ఇన్ని విజయాలు సాధించలేదు. భారత్‌, ఆస్ట్రేలియా సంయుక్తంగా 28 విజయాలు సాధించాయి. 

తాజాగా ఇంగ్లండ్‌.. టీమిండియా, ఆస్ట్రేలియా పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది. ఇంగ్లండ్‌ డబ్ల్యూటీసీలో 29 విజయాలు సాధించేందుకు 58 మ్యాచ్‌లు తీసుకోగా.. భారత్‌, ఆస్ట్రేలియా చెరి 46 మ్యాచ్‌ల్లోనే 28 విజయాలు సాధించాయి. డబ్ల్యూటీసీలో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఇంగ్లండ్‌, భారత్‌, ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్‌ (15), సౌతాఫ్రికా (15), పాకిస్తాన్‌ (10), శ్రీలంక (9), వెస్టిండీస్‌ (8), బంగ్లాదేశ్‌ (3) ఉన్నాయి.

లార్డ్స్‌ టెస్ట్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 427, రెండో ఇన్ని​ంగ్స్‌లో 251 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 196, రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ తరఫున జో రూట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేయగా.. గస్‌ అట్కిన్సన్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిశాడు. 

లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్‌ (74) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రెండో ఇన్నింగ్స్‌లో చండీమల్‌ (58) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అట్కిన్సన్‌ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రెండు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)